కరోనా ప్రభావంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు అన్నది అందరికీ తెలిసిందే.. ఈ మేరకు ప్రజలకు కొద్దిగా సాయంగా ఉండాలని ఎన్నో కంపెనీలు తమ కంపెనీ నుంచి వస్తున్న వాటి మీదా భారీ తగ్గింపును అందించారు. ఇక మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు కూడా అదే విధంగా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరకే ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు సంస్థ పోటీ ఇస్తోంది. కేవలం రూ.397 కే ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. అయితే ఈ ప్లాన్ కింద లభించే కాలింగ్, డేటా ప్రయోజనాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. ఈ ప్రయోజనాలు 60 రోజుల వరకు వర్తిస్తాయి. 


అయితే మీ సిమ్ యాక్టివ్లో ఉంచుకోవడానికి పదే పదే రీఛార్జ్ చేసే తిప్పలు తప్పుతాయి. గతంలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.365కే అందుబాటులో ఉండేది.కాగా ,రూ.397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతి రోజు 2 జిబి డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అయితే, ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులైనప్పటికీ, ప్లాన్ ప్రయోజనాలు మాత్రం 60 రోజుల వరకే అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి..


ఇకపోతే.. బిఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1999కు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కింద 3GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 100 ఎస్ ఎం ఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. 60 రోజుల పాటు బిఎస్‌ఎన్‌ఎల్ టివి కంటెంట్‌తో పాటు ఏడాది పాటు ఎరోస్ నౌ ప్రయోజనాలను ఇస్తుంది. ప్రతిరోజు 3జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 80 కూడా తగ్గిపోతుంది. ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ సాంగ్ ఛేంజ్ ఆప్షన్లతో పాటు ఉచిత బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. ఇలాంటి ఆఫర్లు మున్ముందు ఇంకా ఉన్నాయని సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పింది.. 




మరింత సమాచారం తెలుసుకోండి: