దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులు, ఎటుచూసినా కరోన మరణాల గురించే వినిపిస్తున్నాయి. ఏదైనా సోషల్ నెట్వర్క్ ఓపెన్ చేస్తే చాలు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం రిక్వెస్ట్ లు, హాస్పిటల్లో బెడ్లు ఎంక్వయిరీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఇవి ఉంటే చెప్పండి అంటూ కరోనా బాధితుల పేర్లతో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక అందులో భాగంగానే గూగుల్ మ్యాప్ ద్వారా పేషెంట్ కు కావలసిన ఆస్పత్రి బెడ్లు ఆక్సిజన్ వివరాలను తెలుసుకోవచ్చు.


ఆ ఫీచర్ ఏంటంటే, ఆసుపత్రిలో  బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్ వల్ల లైవ్ సమాచారాన్ని అందించబోతోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. త్వరలోనే అందరికీ ఈ  ఫీచర్ ని లైవ్ లోకి తీసుకురానున్నారు.

బెడ్లు,ఆక్సిజన్ వివరాలు...
దేశంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఇటువంటి సర్వీసులను మొదటిగా ప్రారంభిస్తున్నారు. "నియర్ బై మీ" సర్వీస్ తరహాలోనే ఇది ఉండబోతోంది. గూగుల్ మ్యాప్ లో కి వెళ్లి సమీపంలోని ఆసుపత్రిలో వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ పాతది. కానీ ఇప్పుడు ఆ వివరాలకు అదనంగా, ఆ ఆస్పత్రిలోని బెడ్స్ స్టేటస్ ను కూడా చూపించబోతున్నారట. అయితే ఈ సమాచారం ప్రజల నుండి సేకరించిందే, కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తోంది గూగుల్. గూగుల్ క్యూఆర్ కోడ్ ఫీచర్ ద్వారా ఈ విషయాలు పొందవచ్చు.

వ్యాక్సిన్ సమాచారం..

కొవిడ్ 19 వ్యాక్సిన్ సమాచారాన్ని కూడా గూగుల్ మ్యాప్ లో పొందవచ్చు. అంటే వ్యాక్సిన్ ప్రభావం, వ్యాక్సిన్ వివరాలు , ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనే వివరాలు కూడా ఈ గూగుల్ మ్యాప్ లో పొందవచ్చు. అయితే వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం నుంచి సేకరించి అందిస్తున్నామని గూగుల్ చెబుతోంది. వీటన్నిటిని కూడా గూగుల్ లో ఫీచర్ కోడ్ ద్వారా యూజర్స్ తెలుసుకోవచ్చని గూగుల్ చెబుతోంది.

యూట్యూబ్ లో ప్లే లిస్ట్
హాస్పిటల్  బెడ్స్, ఆక్సిజన్ వ్యాక్సిన్ సమాచారంతో  పాటు సెల్ఫ్ కేర్, ట్రీట్మెంట్ ముందస్తు జాగ్రత్తలు తదితర వివరాలు కూడా గూగుల్ మ్యాప్స్ లో పొందవచ్చు. వీటిని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి వినియోగదారులకు అందించనుంది. దీనితో వీటి వివరాలు యూట్యూబ్ లో కూడా ఓ సెక్షన్ రూపంలో గూగుల్ అందిస్తోంది. అలాగే కరోనా కు సంబంధించిన సమాచారాన్ని అంతా యూజర్లకు అందిస్తోంది యూట్యూబ్. ఇందులో కరోనా నియంత్రణ చిట్కాలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: