ఇక ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న మోసాల‌ను అరికట్టడానికి ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ త‌న ఖాతాదారుల‌కు కొన్ని సూచన‌లు జారీచేసింది. ఇంటెర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ట్రాన్సక్షన్స్ జాగ్రత్తగా ఉండేందుకు అప్ర‌మ‌త్తంగా ఉండాలని తెలియ‌జేసంది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ పొందే వినియోగ‌దారులు చేయ‌వ‌ల‌సిన, చేయకూడ‌ని వాటిని త‌న అఫిషియల్ వెబ్‌సైట్‌లో వినియోగ‌దారుల కోసం పొందుప‌రిచింది.


ఇక చెయ్యాల్సినవి..


* ఆన్‌లైన్లో వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యేందుకు మీ బ్రౌజ‌ర్ అడ్ర‌స్ బార్‌లో https://onlinesbi.com అనే యూ ఆర్ ఎల్ టైప్‌ చేసి యాక్సిస్ కావ‌చ్చు.

* అలాగే మీ కంప్యూట‌ర్‌ను తరచుగా క్ర‌మం త‌ప్ప‌కుండా యాంటీవైర‌స్‌తో స్కాన్ చేయాలి.

* అలాగే లాస్ట్ లాగిన్ తేది, టైం ను ప్ర‌తీసారి చెక్ చేస్తూ ఉండాలి.


చెయ్యకూడనివి...


*సైట్‌ లో లాగిన్ అయ్యేందుకు మెయిల్ లేక మెసేజ్ ద్వారా వ‌చ్చిన లింకుల‌పై క్లిక్ చేయ‌డం మంచిది కాదు.

*అలాగే మీకు తెలియ‌ని వెబైసైట్‌ల నుంచి వ‌చ్చే ఈ మెయిల్‌ను తెరిచి చూడ‌టం, ఈ మెయిల్‌కి జోడించిన లింక్స్‌ను క్లిక్ చేయ‌డం ఖచ్చితంగా మానుకోవాలి.

* ఇక తెలియ‌ని వ్య‌క్తులు స‌ల‌హా ప్రకారం అవ‌స‌రం లేని యాప్‌ల‌ను అస్సలు డౌన్‌లోడ్ చేయ‌కండి.

* ఇక అలాగే వ్య‌క్తిగ‌త స‌మాచారం చెప్తే రివార్డులు ఇస్తామ‌న్న సందేశంతో వ‌చ్చే ఈ మెయిల్‌,ఎస్ఎమ్ఎస్‌ ఇంకా ఫోన్ కాల్స్ వంటి వాటికి చాలా దూరంగా ఉండండి. మీ స‌మాచారాన్ని అస్సలు ఎవరికీ ఇవ్వ‌కండి.

*ఇక అలాగే బ్యాంకు వెబ్‌సైట్ స‌మాచారం అప్‌డేట్ చేస్తున్న కార‌ణంగా మీ వివ‌రాలు తెలియ‌జేయాలి అని వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు మోసగాళ్లు. కాబట్టే జాగ్ర‌త్త‌గా ఉండాలి.

* ఇక ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ప్ర‌భుత్వ సంస్థ‌లు, పోలీస్‌, కేవైసీ అథారిటి నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి స‌మాచారం తెలుసుకునేందుకు ప్రయ‌త్నిస్తారు. ఈ విధంగా ఫోన్ కాల్స్ వ‌స్తే సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి వ‌చ్చే కాల్స్‌గా భావించి వాటిని తక్షణమే నివారించండం మంచిది.


ఇక ఏ బ్యాంకులైన ఈ మెయిల్ ద్వారా గానీ ఇత‌ర సైట్స్ ద్వారా గానీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌వు.కాబట్టి  ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబ‌ర్‌, ఇంట‌ర్ నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్‌, డెబిట్ కార్డు పిన్ నెంబ‌ర్‌, సివీవి, ఓటీపీ వంటి స‌మాచారాన్ని ఎవ్వ‌రితోనూ అస్సలు షేర్ చేయ‌కండి.ఇక ఆన్‌లైన్ ద్వారా చేసే బ్యాంకు ట్రాన్సక్షన్స్ ఖచ్చితంగా సుర‌క్షితంగా పూర్తిచేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: