నేడు మానవుని జీవితం నిత్యం సోషల్ మీడియా రంగం చుట్టూ తిరుగుతోంది. పొద్దున లేచిన దగ్గర   నుండి పడుకునే వరకు సోషల్ మీడియా యాప్ లు అయిన వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, టెలిగ్రాం, లింక్డ్ ఇన్, యూట్యూబ్ వంటి వాటితో గడుపుతున్నారు. వీటన్నింటినీ ప్రతి క్షణం ఫాలో అవ్వము. కానీ వాట్సప్ మాత్రం ప్రతి సెకండ్ చూస్తూనే ఉంటాయి. ఇందులో మనకు తెలిసిన వారితో చాట్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో వాట్సప్ కంపెనీ వారు కొన్ని రకాల నిబంధనల్ని తీసుకువచ్చి కస్టమర్స్ తో వివాదానికి కారణమయ్యిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రతి ఒక్కరు వారి వాట్సప్ కు ప్రొఫైల్ పిక్ (డీపీ) పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ పిక్ ను మన వాట్సప్ కాంటాక్ట్ లో ఉండే వాళ్ళందరూ చూడవచ్చు.
 కానీ ఎవరెవ్వరు మన డీపీ ని చూశారో తెలుసుకొనే అవకాశం అప్పుడు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మీరు మీ డీపీని ఎవ్వరు  చూసినా ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటగా మీరు ప్లే స్టోర్ యాప్ నుండి ఒక ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్ లోడ్ చేసుకున్న "who viewed my whatsapp profile " లేదా "whats  track" యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ తరువాత ఈ యాప్ ను మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తరువాత యాప్ లో చూపించిన విధంగా రన్ అనే బటన్ ను ప్రెస్ చేయండి. ఈ ప్రాసెస్ కొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రన్ అయ్యే టైం లోపల మీ ప్రొఫైల్ పిక్ ను మీకు తెలిసినవారు ఎవరెవరు అయితే చూసి ఉంటారో, వారి వివరాలను కలెక్ట్ చేస్తుంది.
 ఆ తరువాత కొద్ది సమయానికి చుసిన వారి పూర్తి వివరాలు అంటే వారి పేరు నెంబర్ సహా మీ మొబైల్ లో డిస్ప్లే అవుతాయి. కానీ ఈ యాప్ వలన కేవలం 24 గంటలలోపు మీ ప్రొఫైల్ పిక్ చూసిన వారి వివరాలు మాత్రమే పొందే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ను చూసిన వారి వివరాలను తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: