ఎక్కడైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియక అవస్థలు పడతారు.. ఒక్క మాట లో చెప్పాలంటే కానా, పీనా, సొనా పరిస్థితి ఏంటీ?.. అలా మనకు తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికే గూగుల్ సంస్థ  రూపొందించిన యాప్ గూగుల్ మ్యాప్.. వీటి ద్వారా మనకు కావలసిన లొకేషన్ పూర్తి వివరాల తో తెలుసుకొవచ్చు..

ఆగండి.. ఆగండి.. కేవలం మ్యాపింగ్ ఒకటే కాదు.. ఇటీవల మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటు లోకి తీసుకొచ్చింది..ఎంత సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పడానికి బదులుగా, ఎంత ఇంధనాన్ని యూజర్లు ఆదా చేయవచ్చో మ్యాప్స్ నేవిగేషన్ టూల్స్ అంచనా వేసి చూపిస్తాయి.. దీని ద్వారా పెట్రోలు సమస్య పరిష్కారం అవుతుంది.. కాలుష్యం కూడా ఈ ఫీచర్ వల్ల తగ్గుతుందని అధికారులు అంటూన్నారు. ఇది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదిరిపోయే వార్తనే ..కొన్ని రోజుల క్రితమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.


పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యాపార సముదాయాలను సైతం గూగుల్ మ్యాప్స్‌ ప్రత్యేకంగా గుర్తించనుంది. కంపాస్ విడ్జెట్స్‌ను కూడా గూగుల్ మ్యాప్స్ తాజాగా అందుబాటు లోకి తీసుకువచ్చింది. గతం లో ఈ ఫీచర్ ఉండేది. కొన్ని కారణాల కారణంగా తొలగించారు. చాలా టెక్ కంపెనీలు డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా యాప్స్ ఈ నూతన ఫీచర్ ను వినియోగదారుల ముందుంచాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా ఈ జాబితాలోకి చేరింది. డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల యూజర్ కళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం తో పాటు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ అధికారులు అంటున్నారు. ఎటు చూసిన కూడా గూగుల్ మ్యాప్స్ జనాలకు ఎంతో మేలు చెస్తున్నాయనే చెప్పాలి.. అందుకే యువత సరదాగా జై గూగుల్ తల్లి అంటారు.. అది నిజమే అని ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: