ప్రస్తుతం టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది. అయితే రోజు రోజుకి మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతిరోజు ఎన్నో మొబైల్స్ సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు అయితే వారి ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేకమైన మొబైల్స్ తయారుచేసి విడుదల చేస్తున్నారు. ఇలా పోటీ పడుతున్న నేపథ్యంలోనే దిగ్గజ సంస్థల్లో ఒకటైనటువంటి టెక్నో కంపెనీ వారు ఒక మొబైల్ ను  అతి తక్కువ ధరకే విడుదల చేసింది.

టెక్నో స్మార్ట్ ఫోన్ 7  సీరీస్ ధర రూ.7999 కే అందించవచ్చు. 4 జీబీ రామ్,64 జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యంతో స్పార్క్ 7 మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ అసలు ధర రూ.8,999 కాగా, ఈ మొబైల్ మీద 1000 రూపాయల డిస్కౌంట్ తో మనకు లభిస్తుంది. అతి తక్కువ ధరకే అత్యధిక ఫీచర్లతో ఈ మొబైల్ ను రూపొందించారు.

ఇక ఈ మొబైల్ డిస్ప్లే 6.5 ఇంచెస్ HD డిస్ప్లే 1600:720 పిక్చర్ క్లారిటీతో రూపొందించారు. ఇక కెమెరా విషయానికొస్తే, 48 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీ కెమెరా కోసం 8 మెగాఫిక్సల్ తో ఫ్రంట్ కెమెరా ను రూపొందించారు. ఇక అన్ని మొబైల్స్ మాదిరే, అన్ని ఆప్షన్లతో రూపొందించారు.
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ IOS 11 తో పాటు, అత్యధికంగా 6000 MAH బ్యాటరీ తో లభిస్తుంది. ఈ మొబైల్ ఆడియో పరంగా 193 గంటలు వినవచ్చు, వీడియో పరంగా 29 గంటలు వాడుకోవచ్చు. గేమ్ ప్రియులకు ఈ మొబైల్  ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ప్రతి ఒక్కరూ మొబైల్ ని అన్ని విధాలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టెక్నో కంపెనీ 7 టి మోడల్ ను విడుదల చేసింది. ఈ మొబైల్ ను మొత్తం 60 దేశాలలో విక్రయించింది. అయితే ఈ మొబైల్  ఎంత సేల్స్ సంపాదిస్తుందో మన వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: