ఇక మార్కెట్లో వివో స్మార్ట్ ఫోన్స్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వివో నుంచి వీ21ఈ 5జీ నూతన స్మార్ట్ ఫోన్‌ మనదేశంలో జూన్ 24న రిలీజ్ కానుంది.ఇక ఈ మేరకు వివో కంపెనీ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన ఈ మోడల్ 4జీ వెర్షన్ కంటే 5జీ వెర్షన్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సూపర్ స్మార్ట్‌ఫోన్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇక ఈ మేరకు కోహ్లి పోస్టర్‌ తో వివో సోషల్ మీడియాలో ప్రకటించింది.ఇక వివో వీ21ఈ లైట్ బ్లూ కలర్ వేరియంట్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ కనిపించాడు. ఇక అలాగే రూ.15 వేల లోపే ఈ ఫోన్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ సూపర్ స్మార్ట్ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీతోపాటు అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఇక అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేయనుంది. ఇంకా అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లో రానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలతో రానుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండటం విశేషం. ఇక అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇక అలాగే వివో ఫన్‌టచ్ ఓఎస్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ పనిచేయనుంది.ఇక అంతేగాక దీన్ని ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కంపెనీ మార్పులు చేసింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే  4000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్‌ 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.అయితే ఇక ఇంతకు ముందు విడుదలైన 4జీ వర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసి 5జీ వర్షన్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 4జీ వర్షన్ ఫోన్ మలేషియాలో విడుదలైది.ఇక దీని ధర వచ్చేసరికి 1,299 యువాన్లుగా(దాదాపు రూ.23,000) ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల డిస్‌ప్లేతోపాటు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: