నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతాపం వల్లే విజృంభిస్తుంది అని ఇంగ్లాండ్ పరిశోధకులు తెలిపారు. భూతాపం అనేది రోజురోజుకు పెరుగుతుంది.  స్ట్రాటోస్పియర్ లో గల ఓజోన్ పొర కాలుష్యం వల్ల క్షీణిస్తోంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. అడవులను విపరీతంగా నరకడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి 1976 నివేదికతలో ఓజోన్ క్షీణత పరికల్పన కు విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని తేల్చాక, యునైటెడ్ స్టేట్స్, కెనడా,స్వీడన్,  డెన్మార్క్,  నార్వే లతో సహా కొన్ని దేశాలు ఏరోసోల్ స్ప్రే డబ్బాల్లో సి ఎఫ్ సి ల వాడకాన్ని తొలగించడానికి నడుంకట్టాయి. మరింత సమగ్ర నియంత్రణ విధానానికి మొదటి మెట్టుగా దీన్ని పరిగణించారు. అయితే వివిధ రాజకీయ కారణాల వలన,  శాస్త్రీయ పరిణామాల వలన, ఆ తర్వాత ఈ దశలో పురోగతి మందగించింది.

యునైటెడ్ స్టేట్స్ 1978లో ఏరోసోల్ డబ్బాల్లో సి ఎఫ్ సి ల వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధాన్ని విధించాలనే ప్రతిపాదనలను యూరోపియన్ కమ్యూనిటీ తిరస్కరించింది. యుఎస్ లో, సి ఎఫ్ సి ల ను, రిఫ్రిజిరేటర్లలోనూ, సర్క్యూట్ బోర్డులను శుభ్రపరచడానికి ఉపయోగించడం కొనసాగించారు. యుఎస్ ఏరోసోల్ నిషేధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సిఎఫ్సి ఉత్పత్తి బాగా పడిపోయింది. ఓజోన్ పొరకు చిల్లు పడటం అంటే,  బట్టలనుఎలుకలు కొట్టడం ద్వారా చిల్లులు పడ్డటుగాను, రేకు లో మేకు దించితే ఏర్పడే చిల్లు లాగాను ఊహించుకోకూడదు.

ఓజోన్ తరిగిపోయే క్రమంలో ఏర్పడేది ఆక్సిజన్ అణువులు, ఆక్సిజన్ నవజాత పరమాణువులు. ఇవి తిరిగి ఓజోన్ గా మారగలవు. అయితే ఓజోన్ విఘటనం ఈ విధంగా కాకుండా ఇతర మార్గాల్లో ధ్వంసం అయితే, ఉ2 అణువులు, ఉ పరమాణువులు ఏర్పడవు. అంటే వరి పంట వేశాము కానీ,  గింజలు రాలేదనుకోండి. అప్పుడు తర్వాత పంటకు ధాన్యం ఉండదు కదా! అలాగే ఓజోన్ ను ఇతర మార్గాల ద్వారా ఖర్చు చేస్తే తిరిగి అది ఓజోన్ గా  మారే దారుల్ని మూసేసినట్టే! ఆ తర్వాత ఆ ఇతర మార్గాలే లక్షల మందికి చర్మ క్యాన్సర్ రాకుండా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడకుండా నిలువరించే ఓజోన్ పొరను 1930లో కనుగొన్నారు. భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఓజోన్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: