టీవీల తయారీకి ప్రసిద్ధి చెందిన చైనా కంపెనీ అయిన హిసెన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే మొట్ట మొదటి రోలబుల్ స్క్రీన్ లేజర్ టీవీని ప్రకటించింది. 3 వ గ్లోబల్ లేజర్ డిస్‌ప్లే టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ లో కంపెనీ ఈ ప్రకటన చేసింది. కొత్త టీవీని ఆవిష్కరిస్తూ, హిసెన్స్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ప్రెసిడెంట్ యు జితావో "లేజర్ డిస్‌ప్లే నిజంగా అద్భుతం. హిసెన్స్ ప్రపంచంలోనే మొట్ట మొదటి రోలబుల్ స్క్రీన్ లేజర్ టీవీ... ఇది ప్రారంభం మాత్రమే" అని అన్నారు.

హిసెన్స్ లేజర్ టీవీ ప్రత్యేకతలు :
రోలబుల్ స్క్రీన్‌తో కొత్త హిసెన్స్ లేజర్ టీవీ 77 అంగుళాల భారీ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ సొంత రోలింగ్ లేదా కర్ల్డ్ స్క్రీన్ టెక్నాలజీ ఫుల్ కలర్ లేజర్ టెక్నాలజీ పవర్ ద్వారా పని చేస్తుంది. ఇది 4K అల్ట్రా - హై HDR రిజల్యూషన్, 107% BT.2020 అల్ట్రా-వైడ్ కలర్, 350 నిట్స్ లైట్ ను సపోర్ట్ చేస్తుంది.

ఇప్పటి వరకు, హిస్సెన్స్ ఈ కర్లింగ్ స్క్రీన్ లేజర్ టీవీకి సంబంధించిన 70 కంటే ఎక్కువ పేటెంట్‌ల కోసం దరఖాస్తు చేసింది. ఇది థియేటర్ గ్రేడ్ ఆడియో అనుభవం కోసం ట్రాన్స్‌విజన్ విజువల్ ఇంజిన్, హార్మోన్ కార్డాన్ స్పీకర్‌లతో వస్తుంది. స్క్రీన్ ఆన్ చేసినప్పుడు ఇది థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుందని, దాన్ని రోల్ చేసినప్పుడు ఒపెరా హౌస్ లాగా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.

హార్మోన్ కార్డన్ గోల్డెన్ ఇయర్ బృందం ట్యూన్ చేసిన థియేటర్ - గ్రేడ్ ఆడియో, DTS డ్యూయల్ డీ కోడింగ్, డాల్బీ సౌండ్ ఎఫెక్ట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. కొత్త హిసెన్స్ రోలబుల్ స్క్రీన్ లేజర్ టీవీ JD.com లో బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కంపెనీ దాని ధర లేదా లభ్యత వివరాలను ఇంకా వెల్లడించలేదు. కంపెనీ మునుపటి ప్రకటన ఆధారంగా ఈ టీవీ ఈ సంవత్సరం చివరిలో భారీ సంఖ్యలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: