భూమిపై వనరులు తగ్గిపోతుండటంతో ప్రత్యామ్న్యాయం కోసం వెతుకులాట మొదలైన విషయం తెలిసిందే. దానికి ఉన్న ఒకే మార్గం భూమిని పోలి ఉన్న మరో గ్రహం. అది కనుక్కోవడం అయిపోయినా దానిపై ఇక్కడ బ్రతికినట్టే అక్కడ బ్రతక గలమా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు వనరుల కోసం ఈ ప్రయోగాలు చేస్తుంటే ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి వేరే గ్రహం పైకి పర్యాటకాన్ని కూడా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీని కోసం ఉన్నత వర్గాలు భారీగా నిధులు ఏర్పాటు చేసుకొని ఈ ప్రయోగాలను చేయడం మొదలుపెట్టారు. ఏదైనా సాధ్యం అని నమ్మితే దానిని ప్రత్యక్ష సమాజంలో కూడా నిజంగా జరుగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. అదే చేసి చూపుతుంది ఈ ప్రయోగాలు చేస్తున్న సంస్థ.

స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రయోగాలు చేస్తూ, ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉంది వచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. దానికోసం ప్రాథమిక ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యింది. ఇప్పటికే అంతరిక్షంలో పర్యాటకానికి కొందరు టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారంటే దీనిపై కొందరు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. దానిని కాష్ చేసుకుంటుంది ఈ సంస్థ. పుర్రెకో బుద్ది అన్నట్టుగా సంక్షోభంలో కూడా ఇలాంటి ఆలోచన చేస్తూ దానికోసం ముందుకు పోతుంది ఈ సంస్థ. దీనికోసం ప్రాధమికంగా కొందరికి తర్ఫీదు ఇస్తున్నారు. ముందు వీళ్ళను రోదసి లోకి ప్రయోగాత్మకంగా పంపిస్తారు. ఇలా అనేక ప్రయోగాల అనంతరం సాధారణ ప్రజలను రోదసీలోకి తీసుకెళ్లనుండి ఈ సంస్థ.

తాజాగా సంస్థ మూడు రోజులపాటు రోదసి యాత్ర చేశారు. అపరకుబేరుడు జేర్డ్ ఐసాక్ మాన్ ఆధ్వర్యంలో నలుగురు పర్యాటకులు 3 రోజులపాటుగా రోదసిలో చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమిని చేరారు. వీరు క్రు డ్రాగెన్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. ఇందులో వెళ్లిన వారు ఎవరు అంతరిక్ష యాత్రలో నిపుణులు కాకపోవడం విశేషం. ఇది విజయవంతం కావటంతో సంస్థ మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అయ్యింది.  ఎలాన్ మాస్క్ తన రోదసి ద్వారా మొదటిసారి అంతరిక్షంలోకి పర్యాటకులను పంపిన మొదటి వ్యక్తిగా చరిత్ర కెక్కారు. ఈ ప్రయాణంలో పర్యాటకులకు సాధారణ ఆహారం కూడా అందుబాటులో ఉంచడం విశేషం, అంటే పిజ్జా, సాండ్ విచ్, పాస్తా, మాంసం తదితరమైనవి.

మరింత సమాచారం తెలుసుకోండి: