ప్రధాని నరేంద్ర మోదీ కలలను సాకారం చేస్తోంది భారత రక్షణ సంస్థ డీఆర్‌డీవో. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును వంద శాతం నిజం చేస్తున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు. అత్యంత అధునాతన క్షిపణులను ఇప్పుడు స్వదేశంలోనే.... స్వయం సాంకేతిక పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నామన్నారు సతీష్ రెడ్డి. ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో సతీష్ రెడ్డి పాల్గొన్నారు. దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే... అందుకు స్వదేశీ పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. ప్రస్తుతం ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశంలో స్వదేశీ తయారీ వస్తువుల వినియోగం బాగా పెరిగిందని... అలాగే విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు.

స్వయం సాంకేతిక పెరగాలంటే... అది విద్యార్థి దశ నుంచే ప్రారంభమవ్వాలని సతీష్ రెడ్డి సూచించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ ఆర్గనైజేషన్... డీఆర్‌డీవోలో 1980-90 నాటి పరిస్థితులను సతీష్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలామ్ సహా ఇతర శాస్త్రవేత్తలు చేసిన కృషిని వెల్లడించారు సతీష్ రెడ్డి. నాడు వారు చేసిన ప్రయోగాల వల్లే ... ప్రస్తుతం స్వదేశీ క్షిపణులు తయారు చేసే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అగ్ని, పృద్వీ, ఆకాష్, త్రిషూల్, నాగ్ వంటి క్షిపణలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సతీష్ రెడ్డి. ప్రస్తుతం బాలిస్టిక్ క్షిపణుల తయారీతో... ఎంపిక చేసిన దేశాల క్లబ్‌లో చేరినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో దూర శ్రేణితో పాటు... మరిన్ని శక్తి సామర్థ్యాలు ఉండేలా అత్యాధునిక క్షిపణులు తయారు చేస్తున్నట్లు జేఎన్‌యూ విద్యార్థులకు డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. మోదీ సూచించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రక్రియలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మిసైల్స్ తయారు చేస్తున్నామని... వీటి ద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా పెరుగుతుందని సతీష్ రెడ్డి వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: