దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఇంటర్‌సిటీలో ప్రయాణం చేస్తే ఫాస్టాగ్ తప్పనిసరి. అందుకే వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అందులో ఫోన్‌పే కూడా ఒకటి. ఈ డిజిటల్ పే ప్లాట్‌ఫామ్ ఇప్పటి వరకు దేశంలో లక్షలాది మంది వినియోగదారుల కోసం ఫాస్టాగ్ రీఛార్జ్‌ని ప్రాసెస్ చేస్తున్నట్లు పేర్కొంది.

యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇండస్‌ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బిఎల్, స్టేట్ బ్యాంక్ తో సహా అన్ని ప్రధాన ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకు ఫోన్‌పే రీఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

ఫోన్‌పే ఉపయోగించి మీ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయాలంటే...
1. ముందుగా ఫోన్‌పే యాప్‌ని తెరవాలి. యాప్ లేకపోతే ఫోన్ ను బట్టి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. హోమ్‌పేజీకి వెళ్ళాక రీఛార్జ్, పే బిల్ విభాగంలో చూడాలి
3. దీని తర్వాత రీఛార్జ్ విభాగంలో కనిపించే ఫాస్టాగ్ రీఛార్జ్ ఎంపికపై క్లిక్ చేయాలి
4. ఇప్పుడు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి
5. తర్వాత బ్యాంక్ పేరు, మీ వెహికిల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
6. కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫాస్టాగ్ ఖాతా గురించి సమాచారం తెలుస్తుంది. ఇందులో ఖాతాదారుడి పేరు, ఫాస్టాగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది.
7. దీని తర్వాత మీరు మీ అకౌంట్ నంబర్, పేరుని తిరిగి వెరిఫై చేయాలి. దీని తరువాత మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయవచ్చు.
8. మీ బ్యాంక్‌ను ఎంచుకుని ఆపై కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను జోడించండి
9. ఇప్పుడు మీరు పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
10. చివరగా మీరు రీఛార్జ్ పూర్తి చేయడానికి మీ UPI PIN ని నమోదు చేయాలి.
FASTag రీఛార్జ్ చేసిన తర్వాత మీ బ్యాంక్ నుండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: