ఇక ఒకప్పుడు బేసిక్ ఇంకా ఫీచర్ మోడళ్లతో ఇండియన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు 4జీ, 5జీ ఫోన్‌లతో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను మళ్ళీ శాసించేందుకు రెడీ అవుతుంది. ఇక కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇక ఈమధ్య బండకేసి బాదినా పగలని ఎక్స్‌ఆర్‌20ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నోకియా కంపెనీ. ఇక ఇప్పుడు అఫార్డబుల్‌ ప్రైస్‌లో నోకియా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్‌ స్మార్ట్ ఫోన్‌ని ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇక త్వరలోనే ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ఇక నోకియా జీ50 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ విషయానికి వస్తే..ఇది ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో విడుదల కాబోతుంది. అలాగే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇంకా 18 వాల్ట్‌ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ అలాగే 173.83x77.68x8.85 ఎంఎం ఇంకా 6.82 అంగుళాల డిస్‌ప్లే తో పాటు బ్రైట్‌నెస్‌ కోసం 450నిట్స్‌ ఇంకా 4 జీబీ ర్యామ్‌ అలాగే క్వాల్‌కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 480ఎస్‌ఓఎస్‌ వున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే..48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌ తో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ ఇంకా 5 మెగా పిక్సెల్‌ ఆల్ట్రా వైడ్‌ షూటర్‌ అలాగే 2 మెగా పిక్సల్‌ డెప్త్‌ సెన్సార్‌ ఇంకా 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో కూడా వస్తుంది. అలాగే 64జీబీ ఇంటర్నల్‌ మెమోరి కూడా వుంది.512జీబీ వరకు మైక్రో ఎస్‌డీ మెమోరి,ఇంకా 4జీ అలాగే 5జీ నెట్‌వర్క్‌లకు కనెక్టివిటీ ఆప్షన్‌ ఇంకా అలాగే వైఫై 802.11ఏసీ తో పాటు వీ5.0 బ్లూటూత్‌ కూడా వుంది. ఇక జీపీఎస్‌-ఏజీపీఎస్‌ ట్రాకర్‌ అలాగే ఎన్‌ఎఫ్‌సీ(Near-field communication),యూఎస్‌బీ తో పాటు టైప్‌సీ పోర్ట్‌ ఇంకా సెన్సార్లను రిసీవ్‌ చేసుకునేందుకు యాంబీనెట్‌ లైట్‌ అలాగే ఫోన్‌ ఆటో రొటేట్‌ కోసం జిరోస్కోప్‌ ఫీచర్లను కూడా నోకియా కంపెనీ యాడ్‌ చేయడం జరిగింది.


ఇక నోకియా జీ50 4జీబీ ర్యామ్‌ 64 ఇంటర్నల్‌ స్ట్రోరేజ్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికి వస్తే..యూకే మార్కెట్‌లో రూ.20వేలకి అమ్ముడు కానుంది. ఇక మిడ్‌నైట్‌ సన్‌ అలాగే బ్లూ ఓషన్‌ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్‌ యూకే మార్కెట్‌లో భారీ సంఖ్యలో అమ్మకాలు అనేవి చేస్తుండగా.. ఇక అలాగే మరోవైపు అఫార్డ్‌బుల్‌ ప్రైస్‌లో 4జీ మోడల్‌ ఫోన్‌లు నోకియా జీ10 ఇంకా నోకియా జీ20 ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: