ఇక ఇంటర్నెట్ జైళ్లు
ఇక నుంచి అన్ని జైళ్లకు  ఇక నుంచి ఇంటర్నెట్ సదుపాయం కలగనుంది.  త్వరలోనే  జైళ్లన్నింటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సుప్రీం కోర్టు  రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శులకు అదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తక్షణ చర్యులు తీసుకోవాలని కోరింది.  సుప్రీం కోర్టు  రూపొందించిన  సాఫ్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్ మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ( ఫాస్టర్) విధానం అములులోకి తీసుకు రావడానికి ప్రతి జైలులోనూ ఇంటర్ నెట్ తప్పని సరి అని  పేర్కోంది.
 
 బెయిలు పొందిన ఖైదీలు సకాలంలో విడుదల అయ్యోందుకు, స్టే ఆర్డర్లు, మధ్యంత ఉత్తర్వులు వేగంగా అములు చేసేందుకు సుప్రీం కోర్టు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రధాాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం ఈ వేురకు ఉత్తర్వులు జారీ చేసింది .ఫాస్టర్ విధానం అత్యంత వేగంగా అమలయ్యేలా చూడాలని పేర్కొంటూ...అప్పటి వరకూ ఈ వ్యవస్థను ప్రత్యక నోడల్ అధికారి ద్వారా అమలు చేయాలని సూచిచింది.  ఫాస్టర్ విధానం  అమలుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలను అవనరమైన పక్షంలో సవరించాలని, ఈ తాజా ఉత్తర్వులకు అందరూ  నిబద్ధులై ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఈ నూతన వ్యవస్థను అమలు చేయడటం వెనుక బలమైన కారణం ఉంది. గతంలో ఒక కేసు విషయంలో సుప్రీం కోర్టు బయిల్ ఇచ్చినా ఉత్తర్వులు అందని కారణంగా నిందితులు విడదల కాలేదు. ఈ విషయం తెలుసుకున్న న్యాయస్థానం సీరియస్ గా పరిగణించింది. అంతేకాకుండా సుమోటో గా కేసు నమోదు చేసింది. విచారణకు అదేశీించింది. ,సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది దుష్యంత్, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లకు  కోర్టు ఉత్తర్వులు తక్షణం అమలయ్యే విధానం పై విధివిధానాలు రూపొందించాలు సూచిస్తూ నివేదిక ఇవ్వాలని కోరింది. వారి నివేదిను ప్రకారం ఫాస్టర్ విధానం రూపొందింది.  ఈ విధానం అములు చేయాలంటే ప్రతి జైలు లోను ఇంటర్నెట్  అవసం ఏేర్పడుతుంది.  దీంతో ప్రతి కారాగారానికి  ఇక ఇంటర్నెట్ సదుపాయం కలుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: