సాంకేతికత కొత్త విషయాలను వెలుగులోకి తెవాడనైకి బాగా ఉపకరిస్తుంది. ప్రతిసారి సైన్స్ కొత్త విషయాలను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా ఈ సాంకేతికతలో బాగా ఆకర్షిస్తున్న విషయం ఎగిరే వాహనాలు. ఏదో ఆంగ్ల చిత్రాలలో చూపినట్టుగా ఇక మీదట ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళడానికి, అది కూడా ప్రాంతీయంగానే, ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్లొచ్చు. అంటే అలాంటి వాహనాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దానికి కూడా పెద్ద సమయం పట్టదనుకుంటాను. ఇప్పటికే భారీగా ఉత్పత్తి అయిపోయాయి కూడా, అయితే వాటన్నిటిని అనేక విధాలుగా పరీక్షలు చేస్తున్నారు. అవన్నీ ఫలించి, ఆయా శాఖాధికారుల అనుమతి లభించగానే ఇక ఎగరడమే అంటున్నాయి ఆ వాహనాలు.

దాదాపు 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి 430000 వాహనాలను సిద్ధం చేస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2028 నాటికే ఈ వ్యాపారం అంచనా 5.6 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లో 42025 కోట్ల లో ఉంటుందట. భవిష్యత్తు అంతా కూడా ఈ తరహా డ్రోన్లు, ఎగిరే టాక్సీలదే అంటున్నారు నిపుణులు. వీటి సంఖ్య పట్టణాలలో, నగరాలలో పెద్ద సంఖ్యలో ఉండనుంది. వీటికోసం మినీ ఎయిర్ పోర్ట్స్ నిర్మించాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ తరహా వాహనాలు ఉత్పత్తి అమెరికా, బ్రిటన్ లలో జోరుగా సాగుతుంది.  కాలిఫోర్నియాలో జోబీ ఏవియషన్ సంస్థ ఈ తరహా టాక్సీలను 1000 పైగా ఉత్పత్తి చేయగా అవన్నీ పరీక్ష స్థాయిలో ఉన్నాయి. 2024 కల్లా ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు, ఇవి 200ఎంపీహెచ్ వేగంతో 150 మైళ్ళు ప్రయాణించగలవు.

ఇక బ్రిటన్ లో తొలి స్కై పోర్ట్ కోవెంట్రీ లో రగ్భి, ఫుట్ బాల్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అనుమతులు జారీచేసింది. హ్యుందాయ్ సహకారంతో అర్బన్ ఎయిర్ పోర్ట్ దీనిని తయారుచేస్తుంది. ఇక్కడ ఎగిరే టాక్సీలు, కార్గో డ్రోన్ల తయారీ కేంద్రంగా ఖ్యాతి గాంచనుందని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: