టెలివిజన్ గురించి ఏదైనా చరిత్ర చెప్పాలంటే చాలా కథ ఉంటుంది. మొదటగా బ్లాక్ అండ్ వైట్ టివి తో మొదలై.. ఆ తర్వాత స్మార్ట్ టీవీ వరకు తమ ఉనికిని చాటుతున్నది. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో.. ఎక్కువగా అందరూ స్మార్ట్ టీవీ లనే ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఏదైనా స్మార్ట్ టీవీ తీసుకోవాలి అనుకున్నప్పుడు అందులో ముఖ్యంగా మంచి క్వాలిటీ, పిక్చర్స్, సౌండ్ క్వాలిటీ ఇలాంటి అన్ని పరిశీలిస్తూ ఉంటాము. వీటన్నిటినీ కరెక్ట్ గా ఉన్నాయి అంటే మనం థియేటర్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే మనం తీసుకోబోయే టీవీలో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). పిక్చర్ క్వాలిటీ:
మనం స్మార్ట్ టీవీ కొనేటప్పుడు ముఖ్యంగా హెచ్ డి లేదా 4k వంటి డిస్ప్లే ఉండే వంటి వాటిని ఎంచుకోవాలి. పిక్చర్ క్వాలిటీ నాణ్యతను అక్కడే చెక్ చేసుకోవాలి. అందులోనే పిక్చర్ లోని కార్టూన్ లు వివిధ రంగులలో వస్తున్నాయో లేదో గమనించాలి.

2). సౌండ్:
టీవీకి ముఖ్యమైనది సౌండ్. దాని నాణ్యత ఎంత పరిమాణంలో ఉండాలి.. అనే విషయం పై ముందుగా మనం ఒక నిర్ణయానికి  రావాలి. సినిమాలు చూసేటప్పుడు ఎక్కువగా స్పష్టమైన ధ్వనిని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. టీవీ సౌండ్ ఎప్పుడు 10 w పైన ఉండేలా చూసుకోవాలి.

3). ఇతర ఫీచర్స్:
టీవీ లో ముఖ్యంగా హార్డ్ డిస్క్, సపోర్ట్ చేసేలా చూసుకోవాలి. ముఖ్యంగా HD  క్వాలిటీ వంటి పిక్చర్ వుండేలా చూసుకోవాలి. అంతేకాకుండా USB  ప్లేబ్యాక్ పనితీరును మెరుగుపరిచే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఉండేలా చూసుకోవాలి.

ముఖ్యంగా ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి వేలు ఉండేవిధంగా చూసుకోవాలి. మరియు వైఫై కనెక్షన్, సెన్సార్ వంటి ఫీచర్స్  ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ గా ఉపయోగించుకునేందుకు USB వంటి పోర్టును కలిగి ఉన్నదో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫీచర్స్ అన్ని ఉన్నవో లేవో చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: