జూమ్ ఆప్ ను ఉపయోగించే వారికి కంపెనీ 1874 రూపాయలు వరకు చెల్లిస్తోంది. కోవిడ్ సమయంలో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆప్ కు ఆదరణ భారీగా పెరిగింది. ఇప్పటికీ ఈ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియా లో భారీ సంఖ్య లో యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే జూమ్ వినియోగదారుల భద్రత, గోప్యత గురించి పట్టించుకోలేదు అని, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీలతో పంచుకుంటోంది అని ఆరోపణలు వచ్చాయి. జూమ్ ఈ ఆరోపణలు ఖండించింది. అయినప్పటికీ ఆరోపణలను, సమస్యను పరిష్కరించడానికి దాని గోప్యతా, భద్రత విధానాలను మరింతగా మెరుగుపరచడానికి 85 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. వ్యక్తిగత సమాచారం తారుమారు చేసినందుకు యూజర్లకు జూమ్ ఈ పరిహారాన్ని అందజేయనుంది. కంపెనీ యూజర్లకు క్లెయిమ్ సెటిల్మెంట్ గా 25 డాలర్ల వరకూ చెల్లిస్తుంది.

అయితే జూమ్ ఆప్ ను ఉపయోగిస్తున్న అందరూ దీనికి అర్హులు కారు. జూమ్ ఆప్ సబ్‌స్క్రైబర్ అయిన వాళ్లు, అందులోనూ 2016 మార్చ్ నుంచి 2021 జూలై మధ్యలో ఆప్ కోసం చెల్లించిన యూజర్లకు మాత్రమే 25 డాలర్లు క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. జూమ్ మీటింగ్ ఆప్ ను 2016 మార్చి 30 నుంచి 2021 జూలై 30 మధ్య లో రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఆన్లైన్ సెటిల్మెంట్ పొందగలిగే రెండవ గ్రూప్ యూజర్ల అవుతారు.

క్లెయిమ్ ఎలా పొందాలంటే ?
నగదు చెల్లింపు పొందాడనికి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేయడానికి క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేసి సమర్పించాలి. ఫాంను ఆన్లైన్లో www.ZoomMeetingsClassAction.com లో లేదా మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇది క్లెయిమ్ చేసుకోవడానికి చివరి గడువు 2022 మార్చ్ 5 అని గమనించాలి. కాబట్టి కంపెనీ ఇచ్చిన గడువు తేదీ లోపు మీ డబ్బులు మీరు తిరిగి క్లెయిమ్ చేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: