స్మార్ట్‌ఫోన్ ఈ మధ్య అకస్మాత్తుగా స్లో అవుతోందా ? యాప్‌ లు కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదా? కుకీలు, కాష్ ఫోన్ స్లో డౌన్ అవ్వడానికి వెనుక రెండు ప్రధాన కారణాలు కావచ్చు. ఈ రోజుల్లో ఎక్కువగా మన ఫోన్ ఇంటర్నెట్‌ లో సర్ఫింగ్ చేయడం చుట్టూ తిరుగుతుంది. ప్రతి ఒక్క వెబ్ బ్రౌజర్ సాధారణంగా డేటాను సేకరిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే కాష్ అనేది ప్రాథమికంగా వెబ్ బ్రౌజర్ ద్వారా నిల్వ చేయబడిన డేటా. ఇది వెబ్‌సైట్‌లను వేగంగా లోడ్ చేయడంలో సహాయ పడుతుంది. అదే సమయంలో ప్రాధాన్యతలతో సహా వినియోగదారుల నిర్దిష్ట సమాచారాన్ని నిల్వ చేయడానికి కుక్కీలు ఉపయోగిస్తారు. కానీ బ్రౌజింగ్ చరిత్రను ట్రాక్ చేయడానికి వెబ్‌సైట్‌ల ద్వారా కుక్కీలను ఉపయోగించవచ్చు. ఫోన్ స్లో అవ్వడానికి ఇదే కారణం కావచ్చు.

ఏదైనా ఒక వెబ్ సైట్ లేదా ఒక ప్రాజెక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు... ఆ తరువాత మీకు బబ్రౌజర్ ను ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రకటనలు కన్పిస్తాయి. ఇది మనకు పెద్దగా అవసరం ఉండదు. కానీ మనకు తెలియకుండానే సిస్టమ్ లో కుక్కీలు అలాగే ఉండిపోతాయి. అటువంటి ఇబ్బందులను నివారించడానికి ఈ టిప్స్ పాటించండి.

ఆండ్రాయిడ్‌లో కాష్, కుకీలను క్లియర్ చేయడం ఎలా?
chrome బ్రౌజర్ అయితే...
Android ఫోన్‌లోని Chrome నుండి కుక్కీలను క్లియర్ చేయడానికి, ఎగువ కుడి మూలలో ఉన్న మరిన్ని బటన్‌పై నొక్కండి.
ఆపై హిస్టరీపై నొక్కండి, ఆపై బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి.
సెట్టింగ్‌లు > Chrome > నిల్వ & కాష్‌కి వెళ్లవచ్చు
-దీని తర్వాత మీరు కాష్, స్టోరేజ్‌ని విడిగా క్లియర్ చేయగలుగుతారు.

మొజిల్లా ఫైర్ ఫాక్స్
మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఆండ్రాయిడ్ యాప్ నుండి కుక్కీలు, కాష్‌ని క్లియర్ చేయడానికి మూడు నిలువు చుక్కలతో కుడి ఎగువ మూలలో ఉండే మోర్ బటన్‌పై నొక్కండి.
సెట్టింగ్‌లపై నొక్కండి, ఆపై 'బ్రౌజింగ్ డేటాను తీసివేయి'కి నావిగేట్ చేయండి. దీని కింద కుక్కీలు మరియు కాష్‌తో పాటు ప్రస్తుతం తెరిచిన ఏవైనా ట్యాబ్‌లు, మీ బ్రౌజింగ్ చరిత్ర మరియు సైట్ డేటా, సైట్ అనుమతులు తొలగించవచ్చు. కాష్, కుక్కీలను క్లియర్ చేయడం వెనుక ఉన్న పెద్ద కారణాలలో ఒకటి గోప్యత, భద్రతకు సంబంధించినది. వెబ్ బ్రౌజర్‌లు మీ బ్రౌజింగ్ చరిత్రను పర్యవేక్షించగలిగినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: