దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ లో నేడు మోటోరోలా స్మార్ట్ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లభించనుంది. అది కూడా తాజాగా ఫ్లిప్కార్ట్ లో మోటో డేస్ సేల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మోటోరోలా మొబైల్స్ పై భారీ తగ్గింపు తో పాటు బ్యాంకు డిస్కౌంట్లు కూడా ఆఫర్ల కింద ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఫ్లిప్కార్ట్ మోటో డేస్ సేల్ లో మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై లభిస్తున్న ఆఫర్ వివరాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఫ్లిప్కార్ట్ లో మొదలైన ఈ సేల్ మే 18వ తేదీన ముగియనుంది . ఇక మోటోరోలా గత ఏడాది విడుదల చేసిన అన్ని స్మార్ట్ మొబైల్స్  తో పాటు ఈ ఏడాది విడుదల చేసిన అన్ని స్మార్ట్ మొబైల్ లపై ఆఫర్ ప్రకటించారు. మోటో జీ31 : ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర విషయానికి వస్తే 4జీ బీ ర్యామ్ అలాగే 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర 12,999 రూపాయలు. అలాగే 6జీబీ ర్యామ్,  128జీ బీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ మొబైల్ ధర 14999 రూపాయలు. 4జీ బీ ర్యామ్ అలాగే 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ద్వారా ఈ సెల్ లో మీరు కేవలం 10999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక 6జీబీ ర్యామ్,128జీ బీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మీరు కేవలం 12,999 రూపాయలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించబడినది ఫ్లిప్కార్ట్.

అంతేకాదు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 10% ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 13 మెగా పిక్సల్ ఫ్రంట్.. ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్ తో .. 21 టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇవ్వబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: