ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ చాలా కీలకమైన వస్తువుగా మారిపోయింది. దీని ద్వారా అనేక పనులు మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవడంతో పాటు ఎన్నో గంటల సమయం ఆదా కూడా అవుతోందని చెప్పవచ్చు. ఉదయం నిద్ర లేచింది మొదలు మనం రాత్రి పడుకునే వరకు మన స్మార్ట్ ఫోన్ మన దగ్గరే ఉంటుంది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల మన స్మార్ట్ ఫోన్ జీవితకాలం తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మీ స్మార్ట్ఫోన్లలో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1). చాలామంది ఏదైనా సందర్భాలలో ఇతర మొబైల్ చార్జర్ ద్వారా చార్జింగ్ చేస్తూ ఉంటారు మొబైల్స్ కి. ప్రతి ఒక్కరు తమ ఒరిజినల్ చార్జర్ తోనే మొబైల్ కు వీలైనంతవరకు చార్జింగ్ చేయడానికి  ప్రయత్నించాలి ఎందుకంటే చౌక చార్జర్ ను ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని నిపుణులు తెలియజేశారు.

2). కొంతమంది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని యాప్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్ లను  ఉపయోగించుకోవడం ద్వారా మాల్వేర్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే మీ ఫోన్ తో పాటు మీకు ఆర్థికంగా కూడా హాని కలిగిస్తుందని చెప్పవచ్చు.

3). పేరున్న మొబైల్ బ్రాండ్ లు తమ వినియోగదారుల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్డేట్ సెక్యూరిటీ చేస్తూనే ఉంటారు. ఇక OS వినియోగదారుల కోసం అయితే నిరంతరము విడుదల చేస్తూనే ఉంటారట. ఇలా ప్రతిసారి అప్డేట్ చేయడం వల్ల మొబైల్ కు ఎటువంటి హానికరమైన దాడులు ఉండవు.

4). ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ఎక్కడ చూసినా బాగా లభిస్తుంది. అయితే పబ్లిక్ లో ఉండే వైఫై ని వాడేటప్పుడు చాలా మంది హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుచేతనే మీరు ఇలాంటివి వాడేటప్పుడు VPN ఉపయోగించుకోవాలి.

5). ప్రతి ఒక్కరు తమ ఫోన్లో ఉండే యాప్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోవడంతో మొబైల్ చాలా డేంజర్లో పడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: