ప్రముఖ సోషల్ మీడియా యాప్ వినియోగదారులను పెంచుకోవటానికి కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మేరకు తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది.సమాచార మార్పిడి నుంచి ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికల్‌ రంగాలకు సంబంధించిన సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ సంస్థలు కూడా చాట్‌బాట్‌ సహాయంతో వాట్సాప్‌ యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఈక్రమంలో ప్రత్యేకించి మహిళల కోసం మరో అధునాతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్‌ యాజమాన్యం.


మహిళలు తమ నెలసరి ని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ ఈ సేవలను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది..వాట్సాప్‌ ద్వారా ఈ చాట్‌బాట్‌ నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను మహిళలకు అందిస్తోంది. ఈ సేవలను పొందేందుకు గాను మహిళలు ముందుగా తమ నెలసరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్‌బోట్‌ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది. అంతేకాకుండా యూజర్‌కు ముందుగానే నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్‌ను పంపుతుంది.


ఇందుకోసం యూజర్లు +919718866644 అనే నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే మూడు ఆప్షన్లలో పిరియడ్‌ ట్రాకర్‌ అన్నదానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత నెలసరికి సంబంధించిన ప్రాథమిక వివరాలు నమోదు చేసి ఈ సేవలను పొందవచ్చు. మన రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్‌ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్ ను తీసుకొని వచ్చినట్లు అధికారులు తెలిపారు.. మొత్తానికి ఈ ఫీచర్ మహిళకు మంచి బెనిఫిట్ అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: