వినియోగదారుల వాడకం ఎక్కువ అవుతున్న  నేపథ్యంలో పలు రకాల కంపెనీలు కూడా తమ స్మార్ట్ ఫోన్లను రకరకాలుగా మార్చేసి.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్ లను  మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.  ముఖ్యంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి అదే ఫీచర్లతో అద్భుతమైన పర్ఫామెన్స్ తో కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం..

iQoo 11 సీరీస్:
కంపెనీ చైనా..  మలేషియాలో ఈ కొత్త ఫోన్లను డిసెంబర్ రెండవ తేదీన లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఐక్యూ11, ఐక్యూ 11 ప్రో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది . వీటిలో   స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. 6.78 అంగుళాల కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 144 Hz రీఫ్రెష్ రేట్ తో పాటు 120 చార్జింగ్ తో కూడిన 5000mah బ్యాటరి ని కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండవచ్చు.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5G:
ఫోన్ డిసెంబరు ఒకటవ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల స్క్రీన్ 120 ఎడ్జెస్ రిఫ్రెష్ రేట్,  50 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు మీడియా టెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్,  18 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎం ఎ హెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే:
స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే 6.82 అంగుళాల స్క్రీన్ మీడియా టెక్  హీలియో జి 37 ప్రాసెసర్, 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ , 18 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 13 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొత్త ఫోన్ కొనాలని భావించేవారు త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: