ప్రస్తుతం టెలికాం దిగ్గజ సంస్థలలో జియో టాప్ పొజిషన్లో ఉన్నది.. అందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే.. సామాన్యులకు కూడా రీఛార్జి ప్లాన్స్ అందుబాటులో ఉండడమే కాకుండా.. చౌక ధరకే ఫైవ్ జీ వంటి డేటా ప్లాన్ ని కూడా తీసుకురావడం వల్ల చాలా మంది జియోకు యూజర్స్ పెరిగారు. కానీ ఇటీవలే జియో రీఛార్జ్ ప్లాన్లలో 25% వరకు పెంచడం జరిగింది. దీంతో దాదాపుగా కొన్ని లక్షల మంది యూజర్స్ జియోని వదిలి ఇతర నెట్వర్క్ కి వెళ్లడం జరిగింది. ఇలాంటి సమయంలోనే కస్టమర్ల కోసం జియో రీఛార్జ్ ప్లాన్లను కాస్త తక్కువ ధరల చెల్లుబాటు అయ్యేవిధంగా కొన్ని ప్లాన్స్లను తీసుకువచ్చిందట.



స్మార్ట్ ఫోన్లు రిలయన్స్ జియో సిమ్ ను ఉపయోగిస్తున్న వారికి.. రూ.1899 ప్లాన్ తో 336 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. 3600 SMS పంపించుకోవచ్చు.అలాగే 24 జీబీ హై స్పీడ్ డేటా కలదు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్ కలదు. వీటితో పాటు జియో యాప్స్ కూడా ఉంటాయి. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం డేటా అవసరం లేకుండా ఎక్కువగా మాట్లాడే వారికి ఈ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది కానీ అధిక డేటా వినియోగించే వారికి మాత్రం ఈ ప్లాన్ కాస్త నిరాశగానే ఉంటుంది.


ఈ ప్లాన్ లో జియో టీవీని ఉచితంగా వీక్షించవచ్చు. రూ 3599 రూపాయలతో 365 రోజులు అన్లిమిటెడ్ ఫైవ్ జి డేటా తో పాటు 2.5 gb ప్రతి రోజు కూడా 4g డేటా హై స్పీడ్ తో లభిస్తుంది అలాగే.. వీటితోపాటు జియో ప్లాన్స్ కూడా కలవు.. ఇవే కాకుండా ఇతర ప్లాన్స్ కూడా జియోలో కలిగి ఉన్నాయి అయితే ఇతర నెట్వర్క్ లతో పోలిస్తే జియోలో కాస్త చౌకగానే  ప్లాన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరింత ఆకట్టుకునే విధంగా జియో ప్లాన్లను చేంజ్ చేస్తుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: