చాలామంది ఏదైనా సెర్చింగ్ చేయాలంటే కచ్చితంగా మొబైల్లో గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గూగుల్ క్రోమ్ యూస్ చేసే వారికి ఒక బ్యాడ్ న్యూస్ తెలియజేస్తూ కీలకమైన హెచ్చరికలను జారీ చేస్తోంది. ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో చాలా బగ్ లు ఉన్నట్లుగా గుర్తించారట. వీటిని హ్యాకర్లు ఉపయోగిస్తున్నారని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకే ఈ మేరకు గూగుల్ క్రోమ్ని బ్రౌజర్ ని ఉపయోగించేవారు వెంటనే అప్డేట్ చేసుకోవాలంటే హెచ్చరిస్తోంది.



ఇలా చేయడం వల్ల సేఫ్ గా ఉండవచ్చని క్రోమ్ వెబ్ బ్రౌజర్ లో చాలా లోపాలు ఉన్నట్టుగా గుర్తించారట. ఇలాంటి వాటిని హ్యాకర్లు ఉపయోగించి హ్యాక్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. హ్యాకర్లు క్రోమ్ ని హ్యాక్ చేసిన తర్వాత.. మన మొబైల్లో సిస్టంలో ఉండేటువంటి డేటాని మొత్తం స్టోర్ చేసి కాపీ చేసుకుంటారట.. దీని ద్వారా ప్రైవసీని కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని CERT -IN తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సిస్టంనే వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్లిపోతుందని దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలుపుతున్నారు.


ముఖ్యంగా పాస్వర్డ్ సైతం వారు మార్చే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు.ఇంతటితో ఆగకుండా తమ మాల్వేరును నెట్వర్క్ తో కంప్యూటర్ లేదా మొబైల్ ఉంచేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందట.. అయితే విండోస్, మ్యాక్ యూజర్లు సైతం కచ్చితంగా.. గూగుల్ క్రోమ్ 127.O.6533.88/89 వంటి వర్షన్ కి అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నది. అలాగే క్రోమ్ బ్రౌజర్లను సైతం ఆటోమేటిక్ అప్డేట్ అనే ఆప్షన్ లో ఉంచాలట. తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను సైతం నివారిస్తూ ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇప్పటికే చాలామంది కూడా ఈ హ్యాకర్ల బారిన పడ్డట్టుగా తెలియజేస్తున్నారు.. ఎవరైనా సరే గూగుల్ క్రోమ్ ని బ్రౌజర్ ని అప్డేట్ చేయకపోతే వెంటనే చేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: