డిజె సౌండ్ తో గుండెపోటు వస్తుందా... అంటే కచ్చితంగా గుండెపోటు వస్తుందని ఇటీవల కాలంలో నిరూపణ అయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పెళ్లిళ్ల మరియు వివిధ శుభకార్యాలు రాజకీయ పార్టీల ఊరేగింపు ఇలా పలు కార్యక్రమాలలో డీజే సౌండ్ సిస్టం ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల డిజె సౌండ్ కు హార్ట్ చాలా వీక్ గా ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.  


ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర పరిసర ప్రాంతాలలో శుభకార్యాల లో డీజే సౌండ్ సిస్టం ఉపయోగిస్తున్న సమయంలో పలువురు హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్టు వెల్లడిస్తున్నారు. ఇటీవల కాలంలో శబ్ద కాలుష్యం మరీ విపరీతం కావటంతో చిన్న పిల్లలు వృద్ధులు ఇలా హార్ట్‌ వీక్‌గా ఉన్న వాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు.


సౌండ్ పొల్యూషన్ మీద చట్టాలు కూడా ఉన్నప్పటికీ నిబంధనలను ఎవరూ పాటించడం లేదంటున్నారు. విందులు, వినోదాలు, శుభకార్యాల సమయంలో కూడా అతి శబ్ధాలతో మైక్‌లు, సౌండ్‌ బాక్స్‌లు పెట్టి హోరెత్తిస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ కారకులపై కేసులు, అపరాదరుసుము విధించిన దాఖలాలున్నాయి. కాలక్రమేనా ఈ చట్టాలు సరిగా అమలు కాకపోడంతో రోజురోజుకి సౌండ్‌ పొల్యూషన్‌ పెరిగిపోతోందని వైద్యలు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: