ఈరోజుని ప్రపంచ హీలియం దినము అంటారు. విశ్వంలో రెండవ అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం అయినప్పటికీ, యురేనియం వంటి మూలకాల రేడియోధార్మిక క్షయ ఉత్పత్తి అయిన హీలియం భూమిపై చాలా అరుదుగా దొరుకుతుంది. వాస్తవానికి, హీలియం 1868 లో మాత్రమే కనుగొనబడింది, ముఖ్యంగా ఇద్దరు శాస్త్రవేత్తల కృషికి కృతజ్ఞతలు. హీలియంను మొదటి సారి కనుగొన్నది గుంటూరు లోనే.


1868 ఆగస్టు 18న గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ గ్రహణం అనూహ్యంగా అసాధారణంగా దాదాపు 10 నిమిషాల సేపు ఉంది.  ఆ రోజు ప్రముఖ శాస్త్రవేత్త పియర్‌ జాన్సన్‌ కూడా గుంటూరులోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆర్‌ అగ్రహారంగా అందరూ పిలిచే రామచంద్రాపుర అగ్రహారం అనే ప్రాంతంలోని ఒక చెరువు గట్టు మీద నుంచి ఈ సూర్యగ్రహణాన్ని తిలకించాడు. ఈ సూర్య గ్రహణాన్ని చూసిన తర్వాతే ఆయన హీలియం వాయువు గురించి తన ప్రతిపాదనను ప్రపంచానికి తెలియజేశాడు.


పియర్‌ జాన్సన్‌ ప్యారిస్‌కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు.  సూర్యగ్రహణం సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న వాయువులను కనుగొనేందుకు ఆయన మద్రాస్‌ రాష్టానికి వచ్చారు. అప్పుడు గుంటూరు జిల్లా ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఉంది. దీంతో సూర్యగ్రహణం గుంటూరు నుండి బాగా కనిపిస్తుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆయన 1868 ఆగస్టు నెలలో గుంటూరు వచ్చారు.  ఆగస్టు 18న గుంటూరు నుండే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని చుట్టూ హీలియం వాయువు ఉన్నట్లు గుర్తించారు.


భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. సముద్రలోతుల్లో శ్వాస పీల్చడానికి, బెలూన్లను ఉబ్బించడానికి, సిలికాన్‌ వెఫర్స్‌ తయారు చేయడానికి, అర్క్‌ వెల్డింగ్‌లోనూ, ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాల్లోనూ ఈ హీలియం వాడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: