ఫేస్‌బుక్ సొంత మెసేజంగ్ యాప్ వాట్సప్ ప్రపంవచవ్యాప్తంగా 1 బిల్లియన్ యూజర్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రోజు రోజుకు సరికొత్తగా ఫీచ‌ర్ల‌తో ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. యూజర్లు పెరుగుతుండటంతో వాట్సాప్‌లో వయసు పరిమితి పెట్టాలని నిశ్చ‌యించుకుంది.


ఈ క్ర‌మంలోనే కనీస వయసు లేని వాళ్లు వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు. యురోపియన్ యూనియన్ కు చెందిన యూజర్లు కనీసం వ‌య‌సు లేకుండా వాట్సప్ ఫీచర్ ను ఉపయోగిస్తున్న వాళ్ల అకౌంట్లను త్వరలో వాట్సప్ బ్యాన్ చేయనుంది. యురోపియ‌ర్ యూనియ‌న్ యూజ‌ర్ల‌కు వాట్సాప్ కోసం కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాల‌ని నిర్ధారించింది. 


ఇది గతంలో 13 ఏళ్ళకు పడిపోయింది. కాని డేటా-ప్రొటెక్షన్ చట్టానికి ప్రతిస్పందనగా 2018 ఏప్రిల్‌లో 16 సంవ‌త్స‌రాల‌కు తిరిగి తీసుకువ‌చ్చింది.అయితే ఇది కేవ‌లం యురోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన యూజ‌ర్ల‌కు మాత్ర‌మే. సోషల్ మీడియా అనువర్తనాల్లో చాలా వయస్సు పరిమితుల మాదిరిగా, కొంతమంది పిల్లలు దీన్ని విస్మరించి, వారు చిన్నతనంలో వాట్సాప్ కోసం సైన్ అప్ చేస్తున్నారు. 


ఇప్పుడు 13 ఏళ్ల వయసు లేకపోతే తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అనుమతితోనే వాట్పాప్ వినియోగించుకోవాల్సి ఉంది. కానీ మిగిలిన దేశాల‌కు కేవ‌లం 13 సంవ‌త్స‌రాలు ఉంటే వాట్పాప్‌లో జాయిన్ అవ్వొచ్చు. ఇక కంపెనీకి చెందిన ప్రాడక్ట్స్ వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ లలో ఫేస్ బుక్ ను ప్రమోట్ చేయడం కోసం సిద్ధమవుతున్నట్టు ఫేస్ బుక్ ఇటీవలే ప్రకటించింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: