ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని గగ్గోలుపెడుతున్నారు శాస్త్రవేత్తలు.దీనికితోడు అతివృష్టి,అనావృష్టి వల్ల జనజీవనం అతలాకుతలం అవుతుంది.ఇంతలో మరోబాంబు పేల్చారు నాసా శాస్త్రవేత్తలు.భూమిమీద ప్రమాదం వస్తే మనుషులే మరణిస్తారు,కాని భూమికే ప్రమాదం వస్తే మానవజాతే అంతరిస్తుంది.ఇది నమ్మదగిన సత్యం అని అందరికి తెలుసు.ఇలా ఇప్పటివరకు ఈ పుడమి ఎన్ని ప్రమాదాలను చూసిందో ఎంత చరిత్రను తనలో దాచిందో కాని ఈసారి భూమికి ముప్పు పక్కా అంటూ తేదీని కూడా నిర్ధారించారు.స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌,దీన్ని స్పష్టం చేయడంతో ఆందోళన మరింత పెరిగింది.దీనిపై నాసా కూడా స్పందించింది..



ఏడు సంవత్సరాల క్రితం ఓ సారి ఇదే రూమర్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిందని కాని ఏ నష్టంవాటిల్లలేదని చాలమంది అనుకుంటున్నారు.అలాగని భూమి పూర్తిగా సురక్షితమని మాత్రం చెప్పలేం.ఎందుకంటే,భూమికి కొన్ని వేల మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్న గ్రహశకలాలతో ఏదో ఒక రోజు ముప్పు తప్పదు.ఇదివరకు కొన్ని లక్షలఏళ్ల కిందట ఓ భారీ గ్రహశకలం భూమిని తాకడం వల్ల డైనోసార్లు,తదితర జంతుజాలం అంతమైన సంగతి తెలిసిందే.మళ్లీ అలాంటి ముప్పే భూమికి పొంచి ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు.స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ కూడా ఈ విషయాన్నిస్పష్టం చేశారు.అతిత్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని,దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత శక్తి,సామర్థ్యం మన వద్ద లేవని ట్వీట్ చేశారు.



ఈ గ్రహశకలం పొడవు 1100 అడుగులు ఉంటుంది.ఇది భూమిని ఢీకొడితే 15,000 వేల అణుబాంబుల శక్తి విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ విస్ఫోటనం వల్ల భూమిలో భౌగోళిక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.ఈ గ్రహశకలం భూమి వైపు వచ్చేటప్పుడు సూర్యుడి తరహాలో ప్రకాశిస్తోందని తెలిపారు.ఈ గ్రహశకలం భూమిని తాకితే సగం మాన వళి అంతం కావచ్చని భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది గంటకు 52,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోందని.జూన్ 6,2027 నాటికి భూమిని సమీపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే,నాసా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపడేయలేదు.అది భూమికి దగ్గరగా వస్తుందనే మాట వాస్తవమేనని తెలిపింది.దాని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని,అది భూమికి 23,363 మైళ్ల దూరం నుంచి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.అయితే,అది దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్విస్ట్ ఇచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: