చైనీస్ మొబైల్ మేకర్ షియోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మి నుంచి త్వరలో రాబోతున్న ‘నోట్ 8 ప్రొ’లో లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఫోన్ 4 నుంచి 6 డిగ్రీలు చల్లగా ఉండనుంది. ఎక్కువ సేపు వాడినప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుందని ‘జీఎస్ఎంఎరీనా’ పేర్కొంది.  దీనిలో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.


షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 1080 x 2340 పిక్సెల్స్ మరియు 403 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. నోట్ 8 ప్రొలో సరికొత్త హీలియో జి 90టి చిప్‌సెట్‌ను ఉపయోగించినట్టు చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌లో వెనక నిలువుగా మూడు కెమెరాలు, కుడివైపున నాలుగో కెమెరా ఉన్నట్టు వీబో పేర్కొంది. 


దీంతో పాటు వెనక ఫింగర్ ప్రింట్ స్కానర్, గ్లాస్-శాండ్‌విచ్ డిజైన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 29న చైనాలో నోట్ 8, నోట్ 8ప్రొ, రెడ్‌మి టీవిలను రెడ్‌మి విడుదల చేయబోతోంది.దీనికి 4500 mAh బ్యాటరీ మద్దతు ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ లక్షణాలలో వైఫై, బ్లూటూత్, జిపిఎస్‌తో క‌లిగి వ‌స్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: