ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంతో ముందడుగు వేస్తుంది.  ఒకప్పుడు టెలిఫోన్ రంగంలో దూర ప్రాంతాల వారికి ఏ కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా కొన్ని ఇబ్బందులు తలెత్తేవి.  కానీ ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు..ప్రపంచం నీ గుప్పిట్లో అన్నచందంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఎన్నో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నా.. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్‌  మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది.


ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా గిగా ఫైబర్ నెట్ వర్క్ పరిశీలనప్రస్తుతం ముంబై, ఢిల్లీల్లో పైలట్ ప్రాజెక్టు కింద గిగా ఫైబర్ నెట్ వర్క్ పనితీరును రిలయన్స్ జియో పరీక్షిస్తోంది. వచ్చే మూడు నెలల్లో టెలిఫోన్ నుంచి టెలివిజన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 


తాజాగా రిలయన్స్‌ జియో టీవీ సేవలకు సంబంధించిన సెట్‌-టాప్‌ బాక్స్‌ మోడల్‌ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ‘డ్రీమ్‌ డీటీహెచ్‌’ అనే సంస్థ ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో కేబుల్‌ ఇన్‌/ఔట్‌తో పాటు.. యూఎస్‌బీ 2.0, 3.0, హెచ్‌డీఎంఐ, ఎథర్‌నెట్‌ పోర్టులు ఉన్నాయి. అయితే ఇది అధికారికంగా ఇంకా విడుదల చేయకున్నా.. ‘డ్రీమ్‌ డీటీహెచ్‌’ అనే సంస్థ ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: