ఇంటర్నెట్ వచ్చాక అన్నిపనులు సులువైపోయాయి.మనిషి కూర్చున్న చోటునుండే కదలకుండా అన్నిపనులు చేసుకుంటున్నాడు.దీనివల్ల ఉపయోగమెంతుందో అనర్దాలు కూడా అన్నే వున్నాయి.ఇక మనం రోజువాడే యాప్‌తో మనకు తెలియకుండా ఎన్నిచిక్కుల్లో పడుతున్నామో.మన యూజర్ అకౌంట్స్ హ్యకర్ల చేతికి చిక్కితే పడే ఇబ్బందులు దేవునికి ఎరుక.ఇలా కొంతమంది చేతిచమురు వదిలించు కున్నారు.ఇప్పటికి వదిలించుకుంటున్నారు.ఇక మనఫోన్‌లో వున్న సాఫ్ట్‌వేర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌చేస్తూ.పాస్‌ వర్డ్‌ను మారుస్తూ వుండాలి.అలా చేయంటే మీ ఇష్టం.ఇకపోతే మీరు మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్,ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి.




లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య సమాచారం ఇతరులచేతులకు చిక్కే ప్రమాదం ఉందనేవిషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది.ఈ మేరకు అర్జెంట్ అప్‌డేట్‌ను ఇష్యూ చేసినట్లు‘Metro’వెబ్‌సైట్ వెల్లడించింది.ఒకవేళ ఈ బ్రౌజర్‌ ను అప్‌డేట్ట్ చేయకుంటే...బ్రౌజర్‌లోని కంటెక్ట్స్‌లో గల ఆర్బిట్రరీ కోడ్‌ను హ్యాకర్స్ చేజిక్కించుకున్నారని, క్రోమ్ వినియోగదారుల సీక్రెట్ డేటాను చూడటమే కాకుండా,దాన్ని ఎడిట్ లేదా డిలీట్ చేయగలరని పేర్కొంది.ముఖ్యంగా బ్రౌజర్‌లో నిక్షిప్తమయ్యే బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకుని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయి తెలిపారు.




ఇక ఈ యుగంలో వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి.ఈ బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లుగా అందుబాటులో ఉన్న పలు సరికొత్త ఫీచర్లను వెబ్ విహారాన్ని మరింత రసవత్తరం చేస్తున్నాయి.బ్రౌజింగ్‌లో అందుబాటులో ఉన్నసౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగే వెబ్ బ్రౌజింగ్ టెక్నాలజీ ప్రియులకు ఎంతో కిక్కు నిస్తుంది.కాని వాటిచాటున పోంచివున్న ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలి అనిచెబుతున్నారు నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి: