రోజుకో కొత్త మోడల్,మారుతున్న కొత్త కొత్త ఫీచర్స్,ఇంత వెలుసు బాటు ఏ ఐటెంలో ఉండదు కావచ్చూ.అదేనండి నే చెబుతు న్నది మొబైల్స్ కోసం.ఎన్నో కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి పడుతున్న పోటీలో సరికొత్త మొబైల్స్ మార్కెట్‌లో కి వస్తున్నాయి.ఇప్పుడు అలావచ్చిందే ఇన్ ఫీనిక్స్ కంపెనీ కొత్త మొబైల్.ఇక ఇది సామాన్యులకు ఎంతవరకు ఏ ఏ ఫీచర్స్ కలిగి, అందుబాటులో వుందో చూద్దాం.



అందరికి అందుబాటు ధరలో ట్రిపుల్ కెమెరా,5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో హాంగ్ కాంగ్ కు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ ఇన్ ఫీనిక్స్ కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చింది.ఇప్పుడున్న మార్కెట్లో ఇన్ని ఫీచర్లు కలిగిన ఫోను ఇంత తక్కువ ధరలో దొరకడం ఇంతవరకు చూడలేదనే అనుకోవచ్చు.ఎందుకంటే దీని ధర 6,999 రూపాయలు మాత్రమే.మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లకు ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి.ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 6.52 అంగుళాలుగా ఉంది.బ్యాటరీ సామర్థ్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్న మొబైల్స్ కంటే చాలా ఎక్కువగా 5000 mahగా ఉంది.ఇందులో హీలియో పీ22 ప్రాసెసర్ ను ఉపయోగించారు.



ఇక కెమెరాల విషయానికి వస్తే వెనకవైపు 13 మెగా పిక్సెల్,2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అమర్చారు.అంతే కాకుండా తక్కువ వెలుతురు లో ఫొటోలు దిగడానికి ఉపయోగపడేలా,లో లైట్ సెన్సార్ ను వెనకవైపు ఉంచారు.సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది.4 జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతానికి అందుబా టులో ఉంది.డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ తో వచ్చే ఈ ఫోన్ లో ప్రత్యేకంగా మెమొరీ కార్డు వేసుకోవ డానికి కూడా స్లాట్ ఉంది.అంతేకాకుం డా ఫోన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ 5.0,  ఆడియోజాక్ 3.5 ఎంఎం,ఓటీజీ మరియు ఎఫ్ ఎం సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఇక దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఫ్లిప్ కార్ట్ లో వున్న రెండు రంగుల్లో మొదలయ్యాయి.త్వరలో మరో రెండు రంగులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని.దీనికి సంబంధించిన సేల్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు ఇంకా తెలియవని చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: