బావిలో ఏది వేస్తె అది రాయిలా మారుతుంది అలాగే ఒక తుఫాన్ ప్రతీ రోజు ఒకే సమయానికి  వస్తుంది, ఈ‌ రెండూ వింటుంటే వింతగా లేదు మరి ప్రపంచంలోనే విచిత్రమైన, వింతైన ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒకరిలో ఉంటుంది.


బహుశా వీటి గురించి ఎప్పుడు విని ఉండరేమో. అందులో ఒకటి "దీ పెట్రిఫైయింగ్ వెల్", ఇంగ్లండ్ లో ఉన్న ఈ బావికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది. ఇందులో పడ్డ ఏ వస్తువులైనా సరే కొన్ని రోజుల తరువాత రాయిలాగా మారిపోతాయి. కట్టెలు, ఆకులు, ఇనుము ఇలా ఏదైనా సరే ఇందులో వేస్తె కొన్ని రోజుల తరువాత రాయిలా మారిపోతుంది. ఈ బావి లో వేసిన వస్తువు రాయిలా మారడానికి చాలా కారణాలున్నాయి. అక్కడ స్థానికులు మాత్రం ఈ బావిపై దేవతల శాపం ఉందని నమ్ముతారు కాబట్టి ఎవరూ కూడా దీని చుట్టుప్రక్కలకు వెళ్లడానికి ఇష్టపడరు. ఎవరైనా ఈ బావి దగ్గరకు వెళితే వారు కూడా రాయిలాగా మారిపోతారు అనే భయం తో స్థానికులు అక్కడకు వెళ్ళడానికి భయపడతారు.

ఈ బావి ప్రస్తుత కాలంలో పర్యాటక ప్రదేశంగా బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ వింతను చూడటానికి అక్కడకు వచ్చేవారు వారి వస్తువులను అంటే టెడ్డీ బేర్, క్యాప్, సైకిల్ లాంటివి ఈ బావి నీళ్లు వదిలేసి వెళ్తున్నారు. కొన్ని వారాల తరువాత వచ్చి చూస్తే వారు వదిలేసిన వస్తువులు రాళ్లలాగా మారిపోయి కన్పిస్తున్నాయి. ఈ బావులు ఇలా ఆశ్చర్యకరంగా మారడానికి కారణం మాత్రం అక్కడ నీటిలో ఇనుము లాంటి ధాతువులు ఎక్కువ శాతంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకనే ఈ నీళ్లు ఏదైనా వస్తువు పైన పడితే ఆ వస్తువు రాయిలాగా మారతాయి, కానీ ఈ బావి వెనుక అసలు రహస్యాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు.

రెండోవది "థా బేకొన్ ఆఫ్ మైరకైబో", పశ్చిమ వెనిజులాలోని క్యాటర్ టుంబోన్ నదిపై ఒక తుఫాన్ ఎప్పుడూ  నిర్విరామంగా వస్తుంది. ఈ తుఫాను సరిగ్గా ప్రతి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో మొదలై ఉదయం ఐదు గంటల వరకు నిర్విరామంగా వస్తుంది. అంటే దాదాపు పది గంటల పాటు నిర్విరామంగా కురుస్తుంది, ఈ సమయంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి. అందుకని దీన్ని పిడుగుల తుఫాన్ అని కూడా అంటారు.

మొదటిగా శాస్త్రవేత్తలు అక్కడి రాళ్లలో యురేనియం ఎక్కువగా ఉండటం వల్లే ప్రతి రోజు రాత్రి ఈ తుఫాన్ వస్తుందని అనుకున్నారు. కానీ ఒక కొత్త థియరీ ప్రకారం ఈ తుఫాన్ అక్కడున్న పర్వతాల నిర్మాణం లేదా వాటి ఆకారం కారణంగా కురుస్తుంది అని శాస్త్రవేత్తలు తెలియజేసారు. పర్వతాల నుండి వచ్చే వేడి గాలులు, సముద్రం నుండి వచ్చే చల్లని గాలులతో ఢీకొనడం వల్ల ఈ తుఫాన్ ఏర్పడుతోందని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2010 లో ఈ తుఫాన్ సడన్ గా ఆగిపోవడంతో ఇక ఈ తుఫాన్ అంతమైపోయిందని, ఇంకెప్పుడూ రాకపోవచ్చని పరిశోధకులు భావించారు. కానీ సరిగ్గా నెలన్నర రోజుల తరువాత ఇది మళ్లీ మొదలైంది. అప్పటి నుండి ప్రస్తుత కాలం వరకు నిర్విరామంగా కురుస్తూనే ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: