మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతీ ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే తీవ్ర నష్టాన్ని చవిచూడక మానదు. మనకి సంభందించిన వ్యక్తిగత డేటా ఇప్పుడు ప్రజలకి బహిర్ఘతం అవుతోంది. కేవలం కొన్ని మొబైల్ లో ఉండే యాప్స్ వలన మనకి సంభందించిన వ్యక్తిగత డేటా మొత్తం తెలిసిపోతోంది. ముఖ్యంగా మహిళల విషయంలో గర్భానిరోదానికి వాడే సలహాలతో సహా అన్ని విషయాలని కొన్ని యాప్స్ బయటపెట్టేస్తున్నాయి.

 

సమాచారం బయటపెట్టే యాప్స్ లో MIA Fem and Maya లాంటి యాప్స్ కీలకంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ యాప్స్ పని తీరుని యూకే కి చెందిన ఓ ఇంటర్నేషనల్ సంస్థ బయట పెట్టింది. సదరు యాప్స్ లలో లాగిన్ అయిన మహిళల యొక్క వ్యక్తిగత డేటా మొత్తం బయట పెట్టేస్తున్నాయని ఈ సంస్థ తెలిపింది.

 

మిలియన్ యూజర్స్ ఈ యాప్స్ బారిన పడ్డారని ఈ సంస్థ తెలిపింది. అలాగే గర్భం రాకుండా ఉండేందుకు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు చేపడుతారు, వారు చేసే చాటింగ్ సంబాషణ అన్నీ విషయాలు బయటకి వచ్చేస్తున్నాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో మహిళలు ఎలాంటి వాటిని ఇష్టపడుతారు. వారు సెర్చ్ లో ఎలాంటి వాటికోసం వెతుకుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సున్నితమైన అంశాలు సైతం బయపడ్డాయి. దాంతో ఇలాంటి యాప్స్ ని దూరంగా ఉంచాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: