వాట్సాప్ ఇప్పుడు ఇది లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు. ఒకప్పుడు మెసెజ్ పెట్టాలంటే రూపాయి కట్టవుతుంది అది ఇది అని ఆలోచించే ప్రజలు ఇప్పుడు క్షణాల్లో వంద మెసెజ్ లను పెట్టేస్తుతున్నారు. ఇది ఎవరి వల్ల జరిగింది. వాట్సాప్ అనే ఒక యాప్ వల్ల. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న, తెలపాలన్న మనం ఉపయోగించేది వాట్సాప్. ఇప్పుడు ప్రతిది వాట్సాప్ వల్లే జరుగుతుంది.    


అయితే తాజాగా వాట్సాప్ లో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. కొత్త సమస్య అంటారు ఏంటి ఇప్పటివరకు మనకు ఏం సమస్యలు ఉన్నాయి అని అనుకుంటున్నారా ?ఉన్నాయి కానీ అవి పెద్దగా సమస్యలు అనిపించలేదు. అయితే ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే.. ఎవరైనా ఒకరు వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారికి పంపిన మెసెజ్ లు కాంటాక్ట్స్ లో లేని వారికీ వెళ్తున్నాయి అని వాట్సాప్ వారికీ కంప్లైంట్ ఇచ్చారట. 


ఇవి మాత్రమే కాదట.. వాట్సాప్ లో ఎవరైనా ఫ్రెండ్స్ కి ఒక ఫోటో పంపితే మరో ఫోటో వెళ్తుందట. అయితే ఈ సమస్యలు ప్రపంచవ్యాతంగా చాలామందికి జరిగాయట. కానీ ఈ సమస్యలు రావడానికి కారణం వాట్సాప్ సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఇలా జరుగుతాయట. కానీ ఇది ఒకరకంగా పెద్ద సమస్య అనే చెప్పాలి. ఇలాంటి సమస్యల వల్ల చాలామంది సమస్యలు ఎదురుకుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: