భారతీయ టెలికాం  పరిశ్రమలో జియో ఎంట్రీతో కొద్ది రోజులుగా టెలికం మార్కెట్లో పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది.  ఇక రెండున్న‌రేళ్ల‌లోనే జియో మార్కెట్లోకి దూసుకు వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ట్రాయ్ రిలీజ్ చేసిన గ‌ణాంకాల్లో వోడాఫోన్ -  ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. దేశ‌వ్యాప్తంగా ఈ కంపెనీకి త‌న‌కున్న టాప్ ప్లేస్ మ‌రోసారి నిల‌బెట్టుకుంది. ఈ కంపెనీకి 38 కోట్ల మంది వినియోగ‌దారులు ఉన్నారు.


ఇక సంచ‌ల‌నాల‌తో దూసుకుపోతోన్న రిలయన్స్‌ జియో  33.98 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానంలో ఉంది. జియోకు, వోడాఫోన్ - ఐడియాకు కేవ‌లం 4 కోట్ల మంది వినియోగ‌దారులే తేడా. అయితే జియో దూకుడు చూస్తుంటే త్వ‌ర‌లోనే వోడాఫోన్ - ఐడియాను క్రాస్ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్‌టెల్ తొలి మూడవ స్థానంలోనూ నిలిచాయి.  


ఇక ట్రాయ్ గ‌ణాంకాలు రిలీజ్ చేయ‌డంతో గురువారం బేర్‌ మార్కెట్‌లో  కూడా వోడాఫోన్‌ ఇండియా కౌంటర్‌ ఏకంగా 16శాతం ఎగియడం  విశేషం. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌,  ఎమ్‌టిఎన్ఎల్ మార్కెట్ వాటాను కేవలం 10.27 శాతం మాత్రమే కలిగి  ఉన్నాయని ట్రాయ్ తన నివేదికలో రాసింది. ఇక రోజు రోజుకు బీఎస్ఎన్ఎల్ త‌న వాటా కోల్పోతూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.


ఇక జూన్ నుంచి జూలై చివ‌రి వ‌ర‌కు నెల రోజుల వ్య‌వ‌ధిలో చూస్తే అన్ని కంపెనీలు చందారులను కోల్పోతుండగా,  వోడాఫోన్‌ ఐడియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. అటు జియో దూకుడు.. ఇటు త‌న చందాదారులు త‌గ్గుతుండ‌డంతో త్వ‌ర‌లోనే ఇండియ‌న్ మార్కెట్లో జియో వోడాఫోన్ - ఐడియాను క్రాస్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: