భారత్ లో మోటో సిరీస్ ఫోన్ల అమ్మకాలలో సూపర్ సక్సెస్ అయిన మోటోరోలా సంస్థ తాజాగా వన్ మాక్రో పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసారు. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో  రూపొందించిన ఈ ఫోన్  ధర రూ.9,999 గా నిర్ణయించారు.ఈ మోటోరోలా వన్ మాక్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఇకపోతే జియో యూజర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు, 125 జీబీ అదనపు డేటాను అందివ్వనున్నామని మోటోరోలా కంపెనీ వారు చెబుతున్నారు..ఇక ఇంతకుముందు మోటో వన్ విజన్, మోటో వన్ యాక్షన్ వంటి ఫోన్లను కంపెనీ మోటో వన్ సిరీస్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఇక రాబోయే మోటోరోలా స్మార్ట్‌ ఫోన్ వన్ మాక్రో ఫీచర్లు ఏంటంటే 6.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్ తో పాటుగా  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, అంతే కాకుండా హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.వంటి సౌకర్యాలున్నాయి.


ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ వంటివి ఉంటాయి. ఇక ఇప్పుడు నడిచేది స్మార్ట్‌ ఫోన్ ప్రపంచం..రోజుకో కొత్తరకం మొబైల్స్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. అందుబాటు ధరల్లో అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా రూపొందిన మొబైల్స్‌ ను పోటీపడి మరీ ఆయా కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: