వాట్సప్.. ప్ర‌త్యేకంగా పరిచయం అవ‌స‌రంలేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు రెండేళ్ల క్రితం 1.5 బిలియన్‌ యూజర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2 బిలియన్‌కు చేరిందని వాట్సాప్ యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఫేస్‌బుక్ అనేక సంస్థలకు మాతృసంస్థగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మాతృసంస్థ నుంచి 2 బిలియన్ యూజర్లు రావడంలో వాట్సాప్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫేస్‌బుక్ యాప్‌కు 2.5 బిలియన్ యూజర్లు ఉండ‌డం విశేషం. అలాగే జనవరిలో విడుదలైన నివేదిక ప్రకారం ఫేస్‌బుక్, మెసెంజర్ , ఇన్స్‌టాగ్రామ్, వాట్సాప్‌లను రోజూ ఓపెన్ చేసే వారి సంఖ్య 2.6 బిలియన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

ఇది గత త్రైమాసికంలో 2.2 బిలియన్‌గా ఉన్నింది.ఇక వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక.. ఇప్పుడు అనేక విధాలుగా వినియోగిస్తున్నారు. దీంతో యూజర్‌కు వచ్చే మెసేజ్‌లు కానీ, యూజర్ పంపే మెసేజ్‌లు కానీ చాలా భద్రంగా ఉంటాయి. అంతేకాదు హ్యాకర్స్ నుంచి ఇతర క్రిమినల్స్ నుంచి సేఫ్‌గా ఉండేందుకు వాట్సాప్ ఫీచర్‌లో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: