ఇది స్మార్ట్‌ఫోన్ల యుగం. ఎవ‌రి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తుంది. అవసరాలకు మొబైల్‌ చాలా అవసరంగా మారింది. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. కాలాగుణంగా మారిన మార్పులతోపాటు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విప‌రీతంగా పెరిగింది. కొంత మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల సెక్యూరిటీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా వ్యవహరించటం వల్ల మీరే స్వ‌యంగా మీ ఫోన్‌న ఇర‌కాటంలోకి నెట్టేస్తున్నారు.

 

మ‌రి అవేంటో చూడండి. స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయకపోవటం కూడా సెక్యూరిటీ తప్పిదమే. అవును!మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది. ఫోన్ పనితీరును మెరుగుపరించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో పాటు అప్లికేషన్ డెవలపర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. అయితే కొంత మంది ఈ అప్‌డేట్‌లను ఏ మాత్రం లెక్క చేయరు. దీంతో రిస్క్‌లో ప‌డాల్సి వ‌స్తుంది. 

 

అలాగే పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ లింక్ పై క్లిక్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదే. ఎంద‌కంటే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే కొన్ని లింక్స్ ప్రమాదకర మాల్వేర్లను కలిగి ఉంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా మాల్వేర్ మీ ఫోన్‌లోని డేటాను నాశనం చేసేస్తుంది. సో.. బీకేర్‌ఫుల్‌..!

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: