ఇటీవ‌ల కాలంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కలకలం రేపుతోంది. దీని ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులలు దొంగిలించి అక్రమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకుంటున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాల్లోని సొమ్మును స్వాహ చేస్తున్నారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు మీపై చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ట్రాక్‌ వ్యూ లాంటి యాప్స్ ఇందుకు బాగా సహకరిస్తున్నాయి. అయితే దీని నుంచి మనల్ని రక్షించుకోవడం ఎలా అనే విషయంపై కొన్ని టిప్స్ ఇస్తున్నాం. 


- మీ మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసిన వెంటనే షట్‌డౌన్‌ కావడం లేదా? స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పటికీ లైట్‌ ఇండికేటర్‌ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్‌ చేశారని అనుమాన పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను ఒక్కసారి రీబూట్‌ చేయడం మంచిది.


- ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే.. మీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని అనుమానించవచ్చు. నెట్‌వర్క్‌ సమస్యల వల్ల వచ్చినప్పటికీ ఫోన్‌ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తుంటే అనుమానించాల్సిందే.


- సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్ అనే పరికరం ద్వారా ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు.


- సెట్టింగ్స్ - బ్యాటరీ సెట్టింగ్స్ -  బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్‌, కోకోనట్‌ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.‌


- మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌ ఆన్‌/ఆఫ్ అవుతోందా? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లే.. మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తారు.


- గేమింగ్‌ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కాల్‌ హిస్టరీ, అడ్రస్‌బుక్‌, కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం పర్మిషన్‌ అడిగితే ఆలోచించుకోవాలి. అందుకే డౌన్‌లోడ్‌ చేసే ముందు ఆ యాప్‌ డెవలపర్‌ పేరును చెక్‌ చేసుకోవడం మంచిది.


మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలర్ట్స్‌ను యాక్టివేట్‌ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్‌లో ఎలాంటి యాప్స్‌ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: