స‌హ‌జంగా ప్రస్తుత స‌మాజంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం. వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది బ్యాంకింగ్ కి సంబందించిన సమాచారం కానీ నగదు లావాదేవీలకు సంబందించి ఇంకా ఇతర అనేక పనులు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంతుంది.ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిస్తుంది. అలాంటి పరిస్థితుల ఈ మార్గాలు పాటించండి మీ ఫోన్ మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- మీ స్మార్ట్ ఫోన్ దొంగలించబడితే లేదా మీరు ఎక్కడైనా పడేసుకుంటే చేయాల్సిన మొదటి పని కాల్ లేదా మెసేజ్ చేయడం. ఒక వేళా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మెసేజ్ చేయండి, మీ ఫోన్ స్విచ్ ఆన్ అయినా వెంటనే మీకు డెలివరీ రిపోర్ట్ వస్తుంది.


- మీ స్మార్ట్ ఫోన్ లోని GPS ఎనేబుల్ అయ్యి ఉంటే Google Device Manager ద్వారా ట్రాక్ చేసి లొకేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది.


- మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక మెసేజ్‌ని రింగ్‌గా సెట్‌ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని ఆండ్రాయిడ్ Device Manager ను ముందు స్టెప్ లో లాగా enable చేసి "Ring"అనే దానిని ప్రెస్ చేసినట్లయితే మీరు సెట్ చేసుకున్న మెసేజ్ తో మీ ఫోన్ సైలెంట్ లో ఉన్న కూడా రింగ్ అవుతుంది.


- మీ కంప్యూటర్ నుండి మీ Google Dashboard ను సందర్శించండి. ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ను OK చేస్తే మీ పేరు, IMEI నంబర్ మరియు లాస్ట్ ఆక్టివిటీ అక్కడ చూడవచ్చు.


- ఇంతకముందు చెప్పిన విధంగా మీ ఆండ్రాయిడ్ device manager ను enable చేసుకోవాలి అందులోని "erase" అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్లయితే మీ ఫోన్ లోని Data అంతే ఎరేస్ అయిపోతుంది.


- ఈ లింక్ https://www.google.com/contacts/ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న google అకౌంట్ తో లాగిన్ అవ్వండి. మీ కాంటాక్ట్స్ లిస్ట్ తిరిగి మళ్లి తెచ్చుకోవచ్చు.మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎరేస్ చేయబడ్డ కాంటాక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు.


- ఆండ్రాయిడ్ Device Manager ద్వారా మీ ఫోన్ ను లాక్ చేసుకోవచ్చు. Android Device Manager ఓపెన్ చేసి అందులో "LOCK " అనే ఆప్షన్ ని ఓకే చేస్తే చాలు


మరింత సమాచారం తెలుసుకోండి: