మొబైల్ దిగ్గజ సంస్థ శామ్సంగ్  తన సంస్థ నుంచీ మరో సరికొత్త మొబైల్ లో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ మొబైల్ కెమెరా ప్రియులకి మరింతగా చేరువ అవుతుందని తెలిపింది. దీనిలో అదునాతమైన ఫీచర్స్ ఉన్నాయని, వినియోగ దారులని ఆకట్టుకునేలా ఆరక్షనీయంగా రూపొందించారని సంస్థ తెలిపింది.గెలాక్సీ A80 స్మార్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ ఫోన్ ముందు కి వెనుకకు కూడా తిప్పగలిగేలా ఉంటుందని సంస్థ తెలిపింది.

 Image result for galaxy a80

ఈ ఫోన్ ముందుకు వెనకకు తిప్పగలిగేలా ట్రిపుల్ కెమెరా సెట్టింగ్ తో ఉంది. ఈ అధునాతనమైన ఫోన్  ని శామ్సంగ్ భారత్ లో రూ.47,990 ధారగా నిర్ధారించి విడుదల చేసింది. ఈ మొబైల్  స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా ప్రాసెసర్ తో ఉంటుంది. రేపటి రోజున అంటే ఆగస్టు 1 వ తేదీన మొదటి సేల్ జరగనుందని తెలిపింది. అలాగే ఈ మొబైల్ 1080×2400 p రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

 Image result for galaxy a80

ఇది 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజ్ తో ఉంటుంది. అయితే ఇందులో స్టోరేజిని పెంచుకునేలా  ఎటువంటి అవకాశాన్ని కల్పించలేదు.  ఇది ఒక 3,700mAh బ్యాటరీ మరియు 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ లో ప్రత్యేకత ఏమిటంటే. ఈ కెమెరాని ముందు భాగంలో సెల్ఫి, వెనుక భాగంలో  కెమెరాలగా  వాడుకునేలా రొటేటింగ్ ఫీచర్ ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే  48MP కెమెరా డిఫాల్ట్ గా రెడ్మి నోట్ 7 ప్రో లా బిన్నమైన పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలని అందిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: