వరల్డ్ వైడ్ వెబ్ ( WWW ) డే అనేది వెబ్ బ్రౌజింగ్‌కు అంకితమైన ప్రపంచ వేడుక. వరల్డ్ వైడ్ వెబ్‌ను టిమ్ బెర్నర్ - లీ 1989లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని సీఈఆర్ఎన్ సెంటర్‌లో హైపర్లింక్‌ల ద్వారా సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి ఒక మార్గంగా భావించారు. నిజానికి ముప్ఫై ఏళ్ల క్రితం పక్క ఊరి విశేషాల కోసం కనీసం పది గంటలపాటైనా వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనిని మార్చేశాయి మూడే అక్షరాలు. సమాచార విప్లవానికి నాంది పలికింది ఆ మూడు అక్షరాలే. అవే www. పూర్తిగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ వెబ్. 


ఇంటర్నెట్‌తో కలిసే మరో పదం “వరల్డ్ వైడ్ వెబ్”, కానీ నిజంగా వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంటర్నెట్ ద్వారా పనిచేసే ప్రపంచ సమాచార వ్యవస్థ. మీరు ఎక్క‌డో కూర్చుని రాసే అక్షరం ప్రపంచం మొత్తం కళ్ళు మూసి తెరిచే లోపు లోకం చోట్టేసి వచ్చేస్తోందంటే.. దానికి కార‌ణం www. మూడు మూడు ద‌శాబ్దాల క్రితం ఆగ‌ష్టు 1 అంటే ఆ రోజున ప్రారంభించారు. బెర్నేర్ - లీ సెర్న్అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు  సహచరులతో కల్సి ఈ ప్రపంచపు  www సమాచార వ్యవస్థ కనిపెట్టాడు.


వీళ్ళంతా కల్సి ఒక ప్రోటోకాల్ వ్యవస్థ రూపొందించారు. అదే మనం HTTP గా పిల్చుకునే Hyper Text Transfer Protocol.  అయితే, దీనిని సామాన్య వాడకంలోకి తీసుకురావడానికి మాత్రం వారికి మరో రెండున్నరేళ్ళు పట్టింది. పూర్తి స్థాయిలో 1992 జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, డిసెంబర్ 1994లో వచ్చిన కొత్త ఆవిష్కరణ‌లతో వరల్డ్ వైడ్ వెబ్ (www) తరువాత సంవత్సరానికల్లా మిలియన్ల మందికి చేరుకుంది. 


ఆ త‌ర్వాత  సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1995లో ఇంటర్నెట్ అప్లికేషన్లకి సహాయకారిగా ఉండేలా స్వంత వెబ్ బ్రౌజర్ అభివృద్ధి చేసింది. అలాగే  విండోస్ కొనుకున్న వినియోగదారునికి www సర్వీసులను కూడా కలిపి అందించే వ్యవస్థ రూపొందించింది. ప్రపంచంలో చాలా వెబ్ సైట్లు www తోనే ప్రారంభం అవుతాయి. www లేకుండా వెబ్ ప్రపంచంతో కలవడం అంత స‌లువు కాదు. వరల్డ్ వైడ్ వెబ్ పదాన్ని తరచుగా ఇంటర్నెట్‌కు పర్యాయపదంగా తప్పుగా ఉపయోగిస్తారు మరియు దీనిని తరచుగా "ఇంటర్నెట్" అని పిలుస్తారు, అయితే వెబ్ అనేది ఇమెయిల్ మరియు యూస్‌నెట్ కూడా చేసే విధంగా ఇంటర్నెట్‌లో పనిచేసే ఒక సేవ.



మరింత సమాచారం తెలుసుకోండి: