సహజంగా మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్ ద్వారా అన్నీ తెలిసిపోతాయి. మరి మన కారు, లేదా బండి ఎవరైనా తీసుకువెళ్ళినపుడు గానీ లేదా దొంగిలించినపుడు గానీ ఇట్టే తెలిసిపోతుంది. యిందుకు గాను అన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నా సరే లేటెస్ట్ గా వచ్చిన 24 hr రియల్ టై ట్రాకర్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుందని. మనం మన స్మార్ట్ ఫోన్ ద్వారా సులభంగా ట్రాక్ చేయచ్చని అంటున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

Letstrack ఈ పేరుతో ఇండియాలో ఈ అధునాతన ట్రాకర్ ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ ట్రాక్టర్లు జిపిఎస్  యూనిట్ లో ఒక సెల్యులార్ కాంపోనెంట్  ఉంటుంది అది జీఎస్ఎమ్ ఎడ్జ్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది ఇది కారు లేదా బండి ఇలాంటి విలువైన వాహనాలలో రహస్యంగా పెట్టుకోవచ్చు. ఈ డివైస్ ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ ఆధారంగా పనిచేసే సిమ్ కార్డు ఆధారంగా పనిచేస్తుంది. ఈ డివైస్ బ్యాటరీ కి ఇగ్నిషన్ వైర్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది

ఈ డివైస్ కు సంబంధించిన నా మొబైల్ యాప్ మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.  సబ్స్క్రిప్షన్ ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ మీ కారు లేదా టూవీలర్ ఆన్ చేసిన ప్రతిసారి మీ మొబైల్ లో ఉండే యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటుంది. మీరు  కారు ఎక్కడ పార్క్ చేసిన ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లొకేషన్ ద్వారా మీకు సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాదు నిర్దిష్టమైన వేగం కంటే కూడా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో అందుకు తగ్గట్టుగా హెచ్చరికలు చూపించడం, సేఫ్టీ అలారం , అలాగే కారు లేదా టూవీలర్స్ లో ఏ స్థాయిలో చమురు ఉంది అనే విషయాలని తెలుపుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: