బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖ‌చ్చితంగా మినిమ‌మ్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ విషయంలో బ్యాంకులు చాలా కఠినంగా ఉంటాయి. ఒక‌టి క‌న్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వ్య‌క్తులు త‌ప్ప‌ని స‌రిగా మినిమిమ్‌ బ్యాలెన్స్ లేక‌పోతే   పెనాల్టీలు ఎదుర్కోవలసి వస్తుంది. దీని క‌న్నా ఒక అకౌంట్‌ను కంటిన్యూ చేయ‌డం ఉత్త‌మం. మ‌రియు ఈ ఒక్క విష‌యంలోనే కాదు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాల‌న్నా అడిషనల్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలు ఉంటాయి.


అయితే  అది కూడా బ్యాంక్ అకౌంట్ ప్రారంభించిన కాలంపై చార్జీలు ఆధారపడి ఉంటాయి. బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసిన 14 రోజులలోపు అయితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. 14 రోజుల తర్వాత అంటే ఏడాదికి ముందే అకౌంట్ క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలు త‌ప్ప‌ని స‌రిగా వసూలు చేస్తారు. మ‌రియు ఏడాది త‌ర్వాత అయితే ఎలాంటి చార్టీలు ఉండ‌వు. కానీ ఇదివరకు ఏడాది తర్వాత కూడా అకౌంట్ క్లోజ్ చేస్తే రూ.500 పెనాల్టీ పడేది. దీనికి జీఎస్‌టీ అదనం.  


అయితే ప్ర‌స్తుతం ఏడాదిలోపు అకౌంట్ క్లోజ్ చేస్తే మాత్రం  రూ.500 నుంచి రూ.1,000 మధ్యలో పెనాల్టీలు వ‌సూల్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో బ్యాంకులు ఓపెనింగ్ కిట్, చెక్ బుక్, డెబిట్ కార్డు వంటివి ఇస్తాయి. అయితే వీటి ఖర్చులు తిరిగి పొందేందుకు ఛార్జీలు వసూలు చేస్తాయని చెబుతున్నారు.  బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందుగానే అందులోని డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవాలి మ‌రియు లోన్లకు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్లకు అకౌంట్‌ను లింక్ చేసి ఉంటే డీలింక్ త‌ప్ప‌ని స‌రిగా చేసుకోవాలి. బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ వద్ద నిర్దిష్టమైన నిబంధనలు ఏమీ లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: