ప్రకృతి ప్రశాంతంగా ఉంది కావచ్చూ.. ఎందుకంటే ఎక్కడ కూడా వాయు కాలుష్యం కనబడటం లేదు.. రణగొణ ధ్వనులు అసలే లేవు.. ఫ్యాక్టరీల విషవాయువులు లేవు.. ఇంతకంటే ఏం కావాలి.. ఈ ప్రకృతి సరికొత్తదనాన్ని సంతరించుకోవడానికి.. కానీ ఇప్పుడున్నది ఒకటే బాధ.. అదేమంటే విష కీటకం అయినా కరోనా చాటుమాటు నుండి మనుషుల పై దాడి చేస్తుంది.. అందువల్ల మరణాలతో పాటుగా, పేదల డొక్కలు ఎండిపోతున్నాయి..

 

 

దీని ప్రభావానికి చాలా దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.. ఇన్నాళ్లూ సంపద,సంపాదన చూసుకుని మురిసిన మానవుడు ఇప్పుడు ఇంటిపట్టున ఉంటున్నాడు.. ప్రపంచం పరిగెత్తుతున్న రోజుల్లో అన్ని దేశాలు కలిసి కనీసం సంవత్సరానికి ఒకరోజు అయినా ప్రకృతిని కాపాడటానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రాణాలు పోతున్నాయి అనగానే కోట్లు కుమ్మరించే కంపెనీల నుండి గల్లీ ఫ్యాక్టరీలు కూడా మూతబడ్దాయి.. అదే పర్యావరణాన్ని కాపాడండి మహాప్రభో అని పర్యావరణ శాస్త్రవేత్తలు గొంతు చించుకుని అరచిన ఎవరు పట్టించుకోలేదు.. నిజానికి స్వచ్చమైన ప్రకృతి నాశనం అవుతున్న వేళ సమస్త మానవాళికి ఇదొక శిక్షగా చెప్పవచ్చూ..

 

 

ఇన్ని రోజులుగా తన ఊపిరిలో సమస్త కాలుష్యాన్ని నింపుకున్న ఈ పంచ భూతాలు ఇప్పుడిప్పుడే కొత్త ఊపిరి పోసుకుంటున్నాయి.. ఇకపోతే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో జ‌నాలెవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ప్రతి చోట ఉన్న రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. మనం జ‌నావాసాల్లోకి రావాలంటే ఇదే స‌రైన స‌మ‌యం అన్న‌ట్లుగా చాలా వ‌ర‌కు జంతువులు.. ఇప్పుడున్న పరిస్దితుల్లో రోడ్ల‌పైకి వచ్చి స్వేచ్చగా సంచరిస్తున్నాయి... తాజాగా ఒట్ట‌ర్లు అనే ప్రాణులు సింగ‌పూర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

 

సింగ‌పూర్ లోని ముస్తాఫా షాపింగ్ మాల్ ద‌గ్గ‌ర ఈ ఒట్ట‌ర్ల గుంపు క‌నిపించింది. ఇకపోతే చాలా అరుదుగా క‌నిపించే ఈ దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను సౌర‌వ్ స‌న్యాల్ అనే జ‌ర్న‌లిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక చేప‌లు, క‌ప్ప‌లు, ప‌క్షులను ఆహారంగా తీసుకునే ఈ జంతువులు స‌ముద్ర‌తీర ప్రాంతాల‌కు స‌మీపంలో క‌నిపిస్తుంటాయి... కానీ ఇప్పుడు అందమైన సింగ‌పూర్  వీధుల్లో షికారు కొడుతున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: