పిజ్జా అంటే చాలా మందికి ఇష్టం. సాధారణంగా పిజ్జాను ఓవెన్ లో చేస్తారు. కాస్త వంట మీద నేర్పరి కలవారు గ్యాస్ స్టవ్ మీద కూడా చేయగలరు. అయితే ఒక వ్యక్తి నిప్పులు కక్కే అగ్నిపర్వతం పై పిజ్జా ను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పిజ్జా సూపర్ టేస్ట్ గా ఉంది. కావాలంటే మీరు తినండి అంటూ నోరూరించేలా చెబుతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్వాటెమాలలో ఉంటున్న డేవిడ్ గార్సియ పకాయ అగ్ని పర్వతాన్ని తన వెంట కొద్దిగా మార్చుకున్నాడు అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న తనదైన స్టైల్లో వెరైటీగా తయారీతో పర్యాటకులను ఆకట్టుకున్నాడు. తను తయారు చేసే పిజ్జా కు పకాయ పిజ్జాలు అని పేరు పెట్టుకున్నాడు. గ్వాటెమాల నగరానికి దక్షిణాన 25 కిలోమీటర్ల అగ్నిపర్వతం ఉంటుంది. ఈ లావా నుంచి వచ్చే వేడి నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తున్నాడు. అలాగే వంటకు సుమారు 1800 ఫారిన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక పాత్రలో వినియోగిస్తున్నారు. దీంతో కేవలం 14 నిమిషాల్లోనే పిజ్జా తయారు అవుతుందట.

అంతేకాకుండా ఈ పిజ్జా భలే రుచిగా ఉంటుందని వివరిస్తున్న గార్సియా వీడియో నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది. ఈ పిజ్జా తయారీ గురించి తెలుసుకున్న పర్యాటకులు పకయా పిజ్జా రుచి చూశాక టెస్టీ గా ఉందంటున్నారు. 23 సంవత్సరాల కిందట మొదటిసారి పకాయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఇప్పటి వరకు 23 సార్లు విస్పోటనం చెందింది. సాధారణంగా ఎవరూ అటువంటి ఆలోచన చేయడానికే సాహసించరు. నిత్యం ఎర్రటి చింతనిప్పులాగా రగిలిపోతూ పొగలు కక్కుతూ ఎప్పుడు పగిలి బయటకు ఉరుకుదామా అని చూసే లావాను నింపుకున్న అగ్నిపర్వతం పైన ఆ లావా వేడిలో పిజ్జాలు కాల్చచటం అంత ఈజీ కాదు. ఎంత వ్యాపారం కోసం అయితే, మాత్రం అంత రిస్క్ అవసరమా మరీ విడ్డూరంకాకపోతే అని అనుకోవచ్చు. కానీ కొత్తదనం కోరుకునేవారు రిస్కును ఎలా కాదనుకుంటారు చెప్పండి. అందుకే డేవిడ్ గార్సియా ఈ రిస్క్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: