జీవితంలో పైకి ఎదగాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం మన ముందు మిలియనీర్ గా , అంతర్జాతీయ ఖ్యాతి ని పొంది అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఒకరు. ఈయన అసలు పేరు సత్యనారాయణ నాదెళ్ల. ఈయన అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఫిబ్రవరి 4 2014 లో నియమితులయ్యారు.

ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా, యల్లనూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో , బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ , ప్రభావతి యుగంధర్ లకు 1967 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. సత్య నాదెళ్ల తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 వ బ్యాచ్ కు  చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ఎన్నో మంచి పనులను చేపట్టి, రాష్ట్రంలో మంచి అధికారిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక తర్వాత 2004వ సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రణాళిక సంఘం యొక్క సభ్యుడిగా  అలాగే ప్రధానమంత్రి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక ఈయన ఐ ఏ ఎస్ పదవికి ఎంపిక అయిన తరువాత తమ కుటుంబాన్ని హైదరాబాద్ కు  మార్చారు.
ఇక సత్య ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, అలాగే పలు చోట్ల పూర్తి చేసుకున్నారు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్కూల్ క్రికెట్ జట్టులో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. అప్పట్లోనే నాయకత్వ లక్షణాలను కూడా ఉణికి పుచ్చుకున్నారు. 1988వ సంవత్సరంలో కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక ఆ తరువాత అమెరికా లో విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండీ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ అందుకోగా, ఇక ఆ తరువాత చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆ తర్వాత సిలికాన్ వాలీ లో అడుగు పెట్టి , ఆ తర్వాత సన్ మైక్రోసిస్టమ్స్ లో పని చేశారు. ఇక అమెరికా పౌరసత్వం హక్కులను కూడా పొంది అక్కడే సెటిల్ అయ్యారు. చదువుకునే సమయంలో అనుపమ అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఈమె తన తండ్రికి తెలిసిన మరొక ఐఏఎస్ అధికారి అయిన కే ఆర్ వేణుగోపాల్ కూతురు. అనుపమను ఆయన 1992 లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈయన మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ గా నియమితులు అవుతారు అన్న వార్తలు రావడంతో ఇతని పేరు బాగా వెలుగులోకి వచ్చింది. సీఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం ను రూపొందించిన వ్యక్తిగా ఈయన పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న సంస్థలన్నీ ఈయన రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగించడం మరో విశేషం. మైక్రోసాఫ్ట్ లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.1992 లోనే మైక్రోసాఫ్ట్ లోకి అడుగుపెట్టి, వ్యాపార సేవల విభాగంలో అత్యంత కీలక పాత్ర పోషించి,, గత ఐదు సంవత్సరాల లోనే కంపెనీ యొక్క వ్యాపారాన్ని దాదాపుగా తొమ్మిది వేల కోట్ల నుంచి 31 వేల కోట్ల డాలర్ల కు చేర్చాడు. ఇక కేవలం పది సంవత్సరాల లోనే కంపెనీలోని ఉన్నత స్థానాలకు కూడా చేరుకున్నారు. అంటే ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టే సరికి మైక్రోసాఫ్ట్ నికర ఆదాయం 31,400 కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికైన తర్వాత ఈయనకు ఏడాది జీతం 112 కోట్ల రూపాయలు.
ఇక ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో మరో సారి తెలుగు వెలుగులు కనిపించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు ఈ సంవత్సరం ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా,అందులో ముగ్గురు  భారతీయ సంతతికి చెందినవారే ఉండటం విశేషం.
గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న సత్య నాదెళ్ల, తన  ర్యాంకును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉన్నారు. ఇక మాస్టర్ కార్డు  సీఈఓ బంగా ఎనిమిదవ స్థానంలో ఉండగా, క్యాలిఫోర్నియా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: