సోఫియా వెర్గరా .. ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సోఫియా వయసు 28 సంవత్సరాల వయసులో గొంతు క్యాన్సర్ బారిన పడిన విషయం, ఆమె స్వయంగా తెలిపింది. అయితే ప్రస్తుతం క్యాన్సర్ బారినుండి బయట పడినప్పటికీ సోఫియా థైరాయిడ్ క్యాన్సర్ గురించి పూర్తిగా అవగాహనకి వచ్చినట్లు తెలిసింది.. ఈమె థైరాయిడ్ క్యాన్సర్ సోకక ముందు ఈ సమస్యను ఎలా కనుగొనబడింది..? ఎలా ఉపశమనం పొందింది .?అనే విషయాలను పూర్తిగా తెలిపింది.

లాస్ ఏంజిల్స్లో మోడ్రన్ ఫ్యామిలీ కి చెందిన స్టార్ నటి సోఫియా వెర్గరా.. ఈమె ఒకసారి అనుకోకుండా గొంతు నొప్పి రావడం, తినేటప్పుడు ఇబ్బందిగా ఉండడం లాంటి పరిస్థితులను ఎదుర్కోవడంతో దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించిందట.అయితే అన్ని పరీక్షలు జరిపిన తర్వాత ఆ వైద్యుడు తనకు గొంతులో గడ్డ ఉందని , అది థైరాయిడ్ క్యాన్సర్ అని స్పష్టం చేశారట.

ఈ విషయం తెలుసుకున్న సోఫియా ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలా ఉపశమనం పొందాలి  అనే విషయాలను ఆరా తీసిందట..ఇక సోఫియా మాట్లాడుతూ.."  నాకు క్యాన్సర్ అని చెప్పగానే నా మనసు చాలా ప్రదేశాలకు వెళ్ళింది. అంతే కాదు నేను ఈ సమస్య నుంచి బయట  ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాను. నాకు  నచ్చిన పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది..? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ..?అనే పూర్తి వివరాలను తెలుసుకొని ఒక అవగాహనకి వచ్చాను.

నేను చేసిన కృషికి వైద్యులు అలాగే నా కుటుంబం కూడా చాలా మద్దతు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తాను..నా వయస్సు 49 సంవత్సరాలు. అయితే అంత చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడడంతో ఏమాత్రం వెనకడుగు వేయకుండా, క్యాన్సర్ నుంచి బయటపడ్డాను. భయపడకుండా మనలో ఉన్న ధైర్యాన్ని నింపుకోవాలి అప్పుడే ఎటువంటి సమస్య అయినా ఇట్టే పోతుంది అని తెలిసింది సోఫియా. అంతేకాదు సోఫియా తెలిపిన వివరాల మేరకు తన థైరాయిడ్ స్థాయిలు బాగున్నాయా..? లేదా..? అని తెలుసుకోవడానికి ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒక సారి రక్త పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉన్నానని తెలిపింది. ఇటీవల ఎప్పుడైనా దగ్గినప్పుడు కొంచెం మతి తప్పినట్టు అవుతోందని తెలిపింది సోఫియా.


మరింత సమాచారం తెలుసుకోండి: