ఇక అంతా అయిపోయింది..  ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది..  ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే నాథుడే లేకుండా పోయాడు. నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో ఉన్న కాస్త ధైర్యం కూడా ఇప్పుడు చెదిరిపోయింది..  ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అన్నది ప్రస్తుతం అందరిలో భయం పట్టుకుంది..  ఇక ప్రాణాలు ఉంటాయా లేక పోతే గాల్లో కలిసిపోతాయా అన్న విషయం తెలియక అందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటారా.. మొన్నటి వరకు ఆప్ఘనిస్తాన్లో ఇంకా అమెరికా సైనికులు ఉన్నారు తమకు రక్షణ కల్పిస్తారని అక్కడి ప్రజలందరిలో కాస్తయినా నమ్మకం ఉండేది.



 కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేకుండా పోయింది..  ఎందుకంటే ఇక అఫ్గానిస్థాన్లో ఉన్న వేలమంది సైనికులను ఉపసంహరించుకోవాలి అంటూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే యుద్ధ విమానాలతో అమెరికా పౌరులతో పాటు సైనికులను కూడా స్వదేశానికి రప్పిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇక ఇటీవలే  అమెరికా సైనికులు పౌరుల తో కూడిన చివరి విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అమెరికా బయలుదేరింది.  అయితే మొన్నటి వరకు తమకు అడ్డు అదుపు లేదు అన్నట్టుగా ప్రవర్తించిన తాలిబన్లలో అమెరికా సైనికులు ఉన్నారు అన్న కాస్త భయం ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది.



 ఇక అమెరికా సైనికులకు సంబంధించిన చివరి విమానం టేకాఫ్ కావడంతో తాలిబన్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి  ఆఫ్ఘనిస్తాన్ నుంచి 20 ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా రక్షణ దళాల తరలింపు ప్రక్రియ పూర్తి అయినట్లు ఇటీవల యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ కన్నెత్ మెకంజీ ప్రకటించారు. దీంతో ఇక అటు తాలిబన్లు సంబరాలు మొదలు పెట్టారు. ఎంతో మంది తాలిబాన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ డ్యాన్సులు సైతం చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: